Russia Warns Ukraine Against Provoking World War III మూడవ ప్రపంచయుద్దానికి నాంధి పలకొద్దు: రష్యా హెచ్చరిక

Danger of third world war is real russian lavrovs warning

Russia ukraine conflict, Ukraine news, Sergey Lavrov, Volodymyr Zelensky, Vladimir Putin, World War 3, Russia Ukraine War, US and allies, Moscow's invasion, America, UK, war-torn Ukraine, Western nations, International

Ahead of a Tuesday summit between the US and allies on delivering more arms to the war-torn Ukraine, Russia has warned of the "serious" prospect of World War III breaking out. Moscow's invasion of its neighbour has sparked an outpouring of support from Western nations, with arms being shipped in to assist the country in fighting Russian forces.

అదే జరిగితే.. మూడవ ప్రపంచయుద్దానికి నాంధి పలికినట్లే: రష్యా వార్నింగ్..

Posted: 04/26/2022 08:23 PM IST
Danger of third world war is real russian lavrovs warning

మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి అసలైన ముప్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోందని రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను పంపే విషయమై తన మిత్ర దేశాలతో అమెరికా ఈరోజు సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్ కు భారీ ఎత్తున ఆయుధాలు, యుద్ధ సామగ్రి అందాయి. వీటితోనే రష్యా సేనలను ఉక్రెయిన్ నిలువరించే ప్రయత్నం చేస్తోంది. పెద్ద సంఖ్యలో రష్యా యుద్ధ విమానాలు, ట్యాంకర్లను ధ్వంసం చేసింది. వేలాది మంది రష్యా సైనికులను చంపేసింది.

అదిచాలదన్నట్లు ఇప్పుడు భారీ ఎత్తున ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపాలని అమెరికా, పశ్చిమ దేశాలు డిసైడ్ అయ్యే పరిస్థితి రావడంతో అణ్వస్త్ర దేశమైన రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రష్యన్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని వార్నింగ్ ఇచ్చారు. 'ఇది ముమ్మాటికీ నిజం. మా హెచ్చరికలను తక్కువగా అంచనా వేయొద్దు' అని అన్నారు. తమకు శక్తిమంతమైన ఆయుధాలను ఇవ్వాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అడుగుతున్నారు. జెలెన్ స్కీ అడుగుతున్న వాటిలో యుద్ధ విమానాలు, భారీ ఫిరంగులు వంటివి ఉన్నాయి.

తాజాగా ఉక్రెయిన్ కు 700 మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. మరోవైపు నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఫైటర్ జెట్లను, యుద్ధసామగ్రిని అందిస్తున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను పంపే దిశగా అమెరికా అడుగులు వేస్తుండటం రష్యాకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. యుద్ధం తీవ్రంగా మారుతుందని హెచ్చరించింది. అసలైన మూడో ప్రపంచ యుద్ధం దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పరిస్థితి చేజారే పరిస్థితే వస్తే... అణ్వస్త్రాలను వాడటానికి కూడా రష్యా వెనకడుగు వేయకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles