తనను తాను పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ గా చెప్పుకున్న ఓ మహిళ.. నిరుద్యోగులే లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టింది. కొన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న మహిళను ఎట్టకేలకు తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు అమె ఆటకట్టించారు. సాంకేతికతను ఉపయోగించుకుని ఇన్నాళ్లూ తప్పించుకున్న నిందితురాలు ఎట్టకేలకు హుస్నాబాద్‌లో పట్టుబడింది. పోలీసులు అమె భర్తను విచారించి అమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవలే పెళ్లైన ఈ నిందితురాలికి ప్రస్తుతం నాలుగు నెలల చిన్నారి ఉండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన ఓ యువకుడు పోలీసు ఉద్యోగం కోసం ఆశపడి ఎస్సైగా పరిచయమైన మహిళను గుడ్డిగా నమ్మి రూ. 10 లక్షలు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఆమె పత్తా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నాలుగు రోజుల క్రితం మాయ ‘లేడీ’కి అరదండాలు వేశారు. విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. సిద్దిపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఎంతోమంది యువకులను మోసం చేసినట్టు వెల్లడించింది.
నిందితురాలి పేరు విజయభారతి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామం. డిగ్రీ పూర్తి చేసి 2018లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నప్పటికీ ఎంపిక కాలేదు. మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది. అప్పులు తెచ్చి మరీ అతడికి రూ. 13 లక్షలు ఇచ్చింది. అతడి చేతిలో మోసపోయిన తర్వాత అప్పులు తీర్చేందుకు ఎస్సై అవతారం ఎత్తింది. ఎస్సై పరీక్షలకు సంబంధించి నకిలీ పత్రాలు, ధ్రువపత్రాలు తయారుచేసింది. అంతేకాదు, ఎస్సైగా ఎంపికైనట్టు నమ్మించి ప్రముఖుల నుంచి సన్మానాలు కూడా చేయించుకుంది. ఆ ఫొటోలను చూపించి పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయడం ప్రారంభించింది.
నారాయణరావుపేట యువకుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసిన విజయభారతి.. అతడి ద్వారా మల్లన్న సాగర్ ముంపు బాధితుల నుంచి బాండ్ పేపర్ రాయించుకుని లక్షలు తీసుకుంది. ఎస్సైగా నమ్మించి వరంగల్‌కు చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. వీరికిప్పుడు నాలుగు నెలల చిన్నారి ఉన్నాడు. ఆమె కోసం గాలించిన పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంది. టవర్ లొకేషన్ తెలియకుండా జాగ్రత్త పడింది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని అతడి ద్వారా ఫోన్ చేయించారు. చివరికి హుస్నాబాద్‌లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ బేబీ పౌడర్ జాన్సన్ & జాన్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు... Read more
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more