MP-MLA Couple Arrested, Taken To Separate Jails బైకుల్లా జైలుకు ఎంపీ నవనీత్.. తలోజా జైలుకు రవి రాణా

Hanuman chalisa row navneet rana lodged in byculla jail her husband shifted to taloja jail

shiv sena, navneet kaur, ravi rana, uddhav thackeray, Navneet Rana, NavneetRana Party, Navneet Rana News, Matoshree, Matoshree Mumbai, Navneet Rana Bjp, Who Is Navneet Rana, Rana, Navneet Rana Mp, Navnit Rana, Navneet Rana Which Party, Navneet Kaur Rana, Navneet Rana Kaur, Navneet Rana Latest News, Navneet Rana Family, Navneet Rana Party Name, Rana Navneet, Hanuman Chalisa Row,hanuman chalisa, Mumbai News

The Mumbai Police have shifted independent MP Navneet Rana to the Byculla women's jail here, while her MLA husband Ravi Rana was taken to Taloja jail in neighbouring Navi Mumbai amid tight security, an official said on Monday.

బైకుల్లా జైలుకు ఎంపీ నవనీత్.. తలోజా జైలుకు రవి రాణా

Posted: 04/25/2022 01:59 PM IST
Hanuman chalisa row navneet rana lodged in byculla jail her husband shifted to taloja jail

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం ఎదుట ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు తన భర్త, బడ్నేరా ఎమ్మెల్యే రవి రాణాతో కలిసివచ్చి హనుమాన్ చాలీసా చదువుతానని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, మాజీ టాలీవుడ్ నటి నవనీత్​ రాణా సవాల్ చేయడం రాజకీయ దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు కూడా నోటీసులు అందజేశారు. అయితే శనివారం రోజున ముందైలోని వీరి నివాసం ఎదుట శివసైనికులు భారీ సంఖ్యలో చేరుకుని అందోళన చేపట్టారు.

దీంతో ఎంపీ నవనీత్ రాణాతో పాటు అమె భర్త రవి రాణాను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి.. కోర్టులో హాజరుపర్చగా.. వారికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించాలని అదేశించింది. దీంతోనవనీత్ రాణాను ఆదివారం అర్థరాత్రి బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. ఆమె భర్త, అమరావతిలోని బద్నేరా ఎమ్మెల్యే అయిన రవి రాణాను మొదట ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ తగినంత స్థలం లేకపోవడంతో, న్యాయపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత అతన్ని నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.

అంతకుముందు రాణాపై సెక్షన్ 153ఏ (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలు), సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు వారిపై ఐపిసి సెక్షన్ 124-ఎ (దేశద్రోహం)ని కూడా చేర్చారు. ఐపీసీ సెక్షన్ 124-ఎ ప్రకారం ఒ వ్యక్తి మాటల ద్వారా లేదా ద్వేషం లేదా ధిక్కారాన్ని రేకెత్తించేందుకు ప్రయత్నించినప్పుడు లేదా చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించినప్పుడు దేశద్రోహ నేరం సెక్షన్ మోపుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiv sena  uddhav thackeray  Matoshree  navneet kaur  ravi rana  Hanuman chalisa  Mumbai  Maharashtra  politics  

Other Articles