TTEs to get hand-held devices to facilitate ticket booking రైల్వే టీసీల చేతికి హెచ్.హెచ్.టీలు.. టికెట్ లేని ప్రయాణాలకు ఇక చెక్.!

Ttes aboard premium trains to get hand held devices to facilitate ticket booking

Hand Held Terminal, HHTs, south central railway, Express trains, Ticket checkers, TTE, Long distance express trains, upload vacant berths, occupied berth availability, without ticket travel, reserved tickets, Secundrabad, Indian Railway

SOON Ticket Checkers on the Central and Western railways’ long distance premium trains will be provided with Hand Held Terminal (HHT) devices to upload vacant and occupied berth availability on real time basis and allow passengers on coming stations to book reserved tickets even if the train has departed or chart is prepared.

రైల్వే టీసీల చేతికి హెచ్.హెచ్.టీ యంత్రాలు.. టికెట్ లేని ప్రయాణాలకు ఇక చెక్.!

Posted: 04/15/2022 09:24 PM IST
Ttes aboard premium trains to get hand held devices to facilitate ticket booking

రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు కొందరు ఘనులు. టికెట్ కలెక్టర్(టీసీ) వచ్చినప్పుడు టాయిలెట్స్ లో దాక్కోవడం, సీట్ల కింద నక్కేయడం చేస్తుంటారు. ఒకసారి టీసీ చెక్ చేసి వెళ్లిపోతే ఇంకా రాడులే అన్న ధీమాతో టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే ఇక ఇట్టే పట్టుకునేలా సాంకేతిక తీసుకొచ్చింది. టికెట్‌ లేకుండా  ప్రయాణించేవారి ఆటలు కట్టిపెట్టేందుకు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్(హెచ్.హెచ్.టి) యంత్రాలను టీసీలకు అందిస్తున్నారు. టికెట్‌ కలెక్టర్లు ఇప్పటి వరకూ ఛార్ట్‌ తిరిగేస్తే గానీ ఏ బోగీల్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో తెలిసేవి కాదు. కానీ ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.

ఇకపై ఈ హెచ్.హెచ్.టి యంత్రాలతో వచ్చే స్టేషన్‌లో ఎన్ని బెర్తులు బుక్‌ అయ్యాయి, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే వివరాలు తెలియనున్నాయి. ఇన్నాళ్లు స్టేషన్ నుంచి రైలు కదిలిన తరువాత ఎక్కిన ప్రయాణికుల నుంచి వివరాలు రాబట్టి.. తమ చార్ట్ చూసుకుంటే కానీ తెలియని వివరాలు ఇకపై స్టేషన్ రాకముందే వారికి తెలియబోతున్నాయి.  దీంతో రిజర్వేషన్‌ చేసుకున్న వారెవరు, టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారెవరో కూడా వారు ఇట్టే పసిగట్టగలరు. అయితే ఇంతకుముందు మాత్రం టికెట్టు కొన్నవారెవరో.. టికెట్ కొననివారెవరో తెలుసుకునేందుకు టీసీలకు పెద్ద ప్రశ్నగా మారేంది.

కానీ ఇప్పుడు టీసీలకు హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ యంత్రాలు అందిస్తుంది రైల్వే శాఖ. ఈ యంత్రాలు రైల్వే ప్రధాన సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఎక్కడ కొత్త టికెట్‌ బుక్‌ అయినా టీసీలకు సమాచారం అందుతుంది. దీంతో టికెట్‌ లేని ప్రయాణికులను టీసీలు సులభంగా గుర్తించవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై నమోదైన కేసుల ద్వారా రైల్వే శాఖకు రూ.111.52 కోట్ల ఆదాయం లభించింది. బుధవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌ ప్రసాద్‌ టికెట్‌ చెకింగ్ అంశంపై సమీక్ష నిర్వహించారు.

హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ను టీసీలకు అధిక సంఖ్యలో అందించాలని ఆయన నిర్ణయించారు. దీంతో టికెట్‌ లేని ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు. దీంతో రైల్వేకు ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఇదిలావుండగా వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే పలుమార్గాల్లో ప్రత్యేకరైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, విశాఖపట్నం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రబాద్ - తిరుపతి, నాందేడ్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 15వ తేదీన టైన్ నం. 07433 సికింద్రబాద్-తిరుపతి మధ్య, 16న ట్రైన్ నం.07434 తిరుపతి-సికింద్రబాద్ మధ్య నడపనున్నారు. 15న ట్రైన్ నం.07082 నాందేడ్-విశాఖపట్నం మధ్య, 17న రైలు నం.07083 విశాఖపట్నం-నాందేడ్ మధ్య నడుస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles