petrol sold at Re 1 per litre on Ambedkar Jayanti రూ. 1కే పెట్రోల్.. ఇంధన ధరలపై బంకు యజమాని నిరసన..

Petrol sold at re 1 in solapur by ambedkarite unit to protest price hike

Petrol Diesel prices, petrol diesel price hike, solapur petrol price, petrol prices today, diesel price today, fuel hike, petrol hike, diesel hike, fuel cost today, fuel cost, Petrol, Babasaheb Ambedkar, Solapur, Maharashtra, Politics

Petrol was sold at Re 1 to 500 buyers at a refilling station in Maharashtra’s Solapur city on Thursday by the Dr Ambedkar Students and Youth Panthers to protest against the rise in fuel prices. Each buyer was given only one litre of the fuel. Police had to be deployed after a crowd gathered at the petrol pump.

ITEMVIDEOS: రూ. 1కే పెట్రోల్.. ఇంధన ధరలపై బంకు యజమాని నిరసన..

Posted: 04/15/2022 11:29 AM IST
Petrol sold at re 1 in solapur by ambedkarite unit to protest price hike

ఇంధన ధరలపై కేంద్రం ఎన్నికలకు ముందు ఒకలా వ్యవహరిస్తూ.. ఎన్నికల తరువాత మరోలా వ్యవహరిస్తూ వాహనదారులను ఇంధన పేరుతోనే భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఈట్ కా జవాబ్ పత్తర్ సే.. (ఇటుకకు జవాబు రాయితో) అన్న చందంగా.. ఇందన ధరలను పెంచుతూ కేంద్రంతో పాటు చమురు సంస్థలు నిర్ణయం తీసుకుని వాహన దారులపై భారం వేస్తుంటే.. అదే ఇంధన ధరలతో తన నిరసన తెలపాలని ఓ బంకు నిర్వాహకుడు చేపట్టిన చర్యల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ఏకంగా లీటరు పెట్రోల్ 120కి చేరుకున్న వేళ.. దానిని కేవలం ఒక్క రూపాయికి మాత్రమే అందించాడు.

ఏంటీ రూ.1కే లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారా..? ఇది నిజమేనా.. లేక ఏప్రిల్ మాసంలో ఎఫ్పుడైనా ఫూల్ చేయవచ్చునని ఇలా అంటున్నారా.? అన్న సందేహం వస్తుందా.? ఇది ముమ్మాటికీ నిజమే. అయితే ఈ లీటర్ పెట్రోల్ కావాలని అనుకుంటూ అది మనకు అందుబాటులో లేదు. కేవలం మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతవాసులకు మాత్రమే. ఇక్కడ ఓ బంక్ నిర్వాహకుడు కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ విక్రయించాడు. అయితే అది కేవలం నిన్న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన ఇలా పెట్రోల్ ను కారుచౌకగా విక్రయించారు. మరి అతనికి చాలా లాస్ కదా.. ఇలా ఎందుకు చేశాడు.. అన్న వివరాల్లోకి వెళ్తే..

ఇంధన ధరల భారం సామాన్యులు మోయలేకుండా పోతున్నారని.. మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ ధరలు విపరీతంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. మధ్యతరగతి వారు కూడా ఇంధన ధరలు, నిత్యావసరాల సరుకుల ధరలతో పాటు కూరగాయాల ధరలు కూడా పెరగడంతో రోజుకో పూట బోజనాలు మాత్రమే చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గించాలని ప్రధాని మోడీకి సందేశం ఇచ్చేందుకు ఇలా చేసినట్లు పెట్రోల్ బంకు నిర్వాహకుడు ఇలా తన నిరసనను వ్యక్తం చేసినట్లు ప్రకటించారు. ఈ కారణంతోనే తాను లీటరు పెట్రోల్ ను కేవలం రూ.1కే విక్రయించానని అన్నారు.

అయితే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని క్రితం రోజున తమ పెట్రోల్ బంకు వున్న మహారాష్ట్ర సోలాపుర్ ప్రాంతవాసులకు ఈ అవకాశాన్ని అందించానని తెలిపారు. అయితే రోజు మొత్తం కాదండోయ్.. కేవలం ఈ రోజులో తొలుత తమ బంకులో పెట్రోల్ కోట్టించుకునే 500 ద్విచక్రవాహనాలకు మాత్రమే ఈ ఆపర్ లభిస్తుందని కూడా కండీషన్ పెట్టారు. అయితే రూ.1కే లీటర్ పెట్రోల్ లభిస్తుండటంతో ఈ పెట్రోల్ బంకుకు వాహనదారులు పోటెత్తారు. ఇక వీరిని సక్రమంగా లైన్లో వచ్చేలా చేసేందుకు పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సివచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles