Newlywed couple gets shocking gift from friends కొత్తజంటకు స్నహితులిచ్చిన కానుకతో అందరూ షాక్.!

Newlywed andhra couple gets shocking gift from friends video goes viral

newlywed couple, surprising gift, friends, video viral, internet, viral video, newly married couple, reception party, friends gift, on opening the gift box, new couple shocked, guests surprised, two handmade fans, palm leave fans, power cut, Power crisis, Andhra Pradesh newly married couple, newly married hand made fans, netizens comments, Andhra power cut, andhra power crisis,

A newlywed couple received a surprising gift from their friends and now the video is going viral on the internet. A newly married couple on their reception day received a gift from their friends. The couple and guests got shocked after seeing two handmade fans made-up of palm tree leaves, showing the present power cut crisis in the state.

ITEMVIDEOS: కొత్తజంటకు స్నహితులిచ్చిన కానుకతో అందరూ షాక్.!

Posted: 04/12/2022 03:32 PM IST
Newlywed andhra couple gets shocking gift from friends video goes viral

స్నేహితుడి పెళ్లంటే ఇక అతని కుటుంబసభ్యుల కన్నా ఎక్కువ హడావిడి చేసేది అతని స్నేహితులే. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ కాగానే బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇవ్వడం నుంచి పెళ్లిపనులు, బాజాభజంత్రీలు, అయ్యావార్లు, వంటవాళ్లు, ఇలా ఒక్కటని కాకుండా అన్నిపనులు వారే కష్టపడి మరీ చేస్తారు. ఇక పెళ్లిరోజున కూడా రాత్రంతా బరాత్ వేడుకల్లో పాల్గోని.. మరుసటి రోజున మళ్లీ విందు కార్యక్రమానికి యస్ వీ ఆర్ హియర్ అంటూ సిద్దంగా ఉంటారు. అయితే వరుడి స్నేహితులు పెళ్లిలో కానుకలు ఇవ్వకుండా విందు రోజున కానుకలు ఇస్తుంటారు.

ఇక మరీ కావాల్సిన స్నేహితులైతే.. మరి ఎక్కువ చనువు తీసుకుని వింత వింత కానుకులను కూడా అందిస్తుంటారు. ఇక మరికొందరు కేక్ తీసుకువచ్చి కట్ చేయిస్తుంటారు. మరికొందరు మంచి కాస్ట్లీ చాకెట్లను ప్యాక్  చేయించి అలా ఒక్క బాక్సు తరువాత మరో బాక్సులో పెటి ప్యాక్ చేయించి వధూవరులు విసుగుచెందేలా కూడా చేయిస్తుంటారు. ఇలా తమకు తోచిన విధంగా స్నేహితులు తమ కానుకలను ఇస్తుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ఓ యువకుడికి పెళ్లి జరిగింది. ఆ తరువాతి రోజున రిసెప్షన్ లో అతని స్నేహితులు వచ్చి కానుకను అందించి దానిని వేదికపైనే తెరవాల్సిందిగా కోరుతారు.

దీంతో వరుడు కానుక కవర్ చింపేందుకే ప్రయాస పడటంతో అతడి స్నేహితులలో ఒకరు.. ఓసోసి.. పెళ్లి గిప్ట్ ప్యాక్ ఓపెన్ చేయడం రావట్లేదు కానీ ఏకంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని కామంట్ చేశారు. ఇది విన్న వధువు నవ్వు ఆపుకోలేకపోతోంది. అయినా వరుడు మాత్రం దానిని పట్టించుకోకుండా కానుకను తెరిచేపనిలో నిమగ్నమయ్యాడు. ఇక తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో విసనకర్రలు ఉన్నాయి. ఒకటి వదువుకు మరకటి వరుడికి అందించారు. ఇక రాత్రింబవళ్లు ఒకరికోకరు ఎంచక్కా విసురుకోండి అని చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కోరత, తీవ్రత అధికంగా వున్న నేపథ్యంలో ఈ కానుకను అందించడం వధూవరులతో పాటు వారి బంధువులకు కూడా ఆశ్చర్యపర్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles