Five killed as train runs over passengers in AP శ్రీకాకుళంలో విషాదం: రైలు ఢీకోని ఐదుగురి మరణం

5 run over by train in andhra pradesh after they got off another train

Konark Express, Train runs over passengers, Bhubaneswar-Mumbai, Secunderabad-Guwahati express, smoke emerged from coach, passengers pull chain, bathuva, railway gate, Srikakulam, Andhra Pradesh, Crime

In a tragic incident, five people, including a woman, were killed and several injured severely after a train ran over them. According to the reports, a few passengers in the Secunderabad-Guwahati express train pulled the chain citing a smoke emerged from the coach and tried to cross the tracks. But, unexpectedly, the Bhubaneswar-Mumbai Konark Expressed coming in the opposite direction ran them over.

శ్రీకాకుళంలో విషాదం: ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు.. దూసుకోచ్చిన మృత్యుశకటం..

Posted: 04/12/2022 12:16 PM IST
5 run over by train in andhra pradesh after they got off another train

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. జిల్లాలోని జి.సిగడాం వద్ద బాతువ గ్రామం సమీపంలో ఐదుగురు ప్రయాణికులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ప్రాణాలు కాపాడుకుందామని చైన్ లాగి రైలును నిలిపిన ప్రయాణికులు.. రైలు నెమ్మదించగానే దూకి పక్కకు వెళ్దామనుకున్నంతలో జరగరాని ఘోరం జరిగిపోయింది. ప్రయాణికుల పాలిట కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు మృత్యుశకటంలా దూసుకువచ్చింది. ఒక రైలులో ప్రమాద సంకేతాలు రావడంతో దూకిన ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టుతూ దూసుకెళ్లడంతో తీవ్ర విషాదం నెలకొంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సికింద్రాబాద్ నుంచి గౌహతికి బయలుదేరిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం రైల్వేస్టేషన్ దాటి బతువ గ్రామానికి చేరుకుంటున్న క్రమంలో జనరల్ రైలు బోగిలో పొగ వ్యాపించింది. దీంతో కంగారు పడిన ప్రయాణికులు వెంటనే అత్యవసరంగా రైలును నిలిపేందుకు చైన్ లాగారు. రైలు నెమ్మదిస్తున్న తరుణంలో దూకి పట్టాలపైకి చేరుకున్నారు. రైలు ఆగడంతో ప్రయాణికులు కిందికి దిగారు. కొందరు అవతలివైపు ఉన్న పట్టాలు దాటే క్రమంలో, అదే సమయంలో దూసుకొచ్చిన కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలును గమనించలేదు.

అయితే వేగంగా దూసుకువస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రేస్ రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. కాగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే మృతులందరూ అసోం, ఒడిశాలకు చెందినవారిగా వారు ఆధార్ కార్డులను బట్టి అధికారులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదంపై అధికారుల కథనం మరోలా ఉంది. ప్రయాణికులు బోగీలో ఎలాంటి పొగ రాకుండానే ఉద్దేశపూర్వకంగా చెయిన్ లాగారని ఆరోపిస్తున్నారు. రైల్వే అధికారులకు దొరికిపోతామన్న కంగారులో పట్టాలు దాటుతుండగా వారిని కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొందని వివరించారు.

కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురు మరణించారని తెలియడంతో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. కోయంబత్తూరు నుంచి సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు సాంకేతికలోపంతో శ్రీకాకుళం జిల్లాలో ఆగిపోగా, ప్రయాణికులు కొందరు కిందికి దిగారు. అయితే, వారు అవతలి వైపు పట్టాలపై నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles