Mother's Chilli Powder Punishment to Curb son Ganja Addiction గంజాయి తాగే మైనర్ కొడుకుకు బద్ది చెప్పిన తెలంగాణ తల్లి..

Suryapet mother s chilli powder punishment answer to curb ganja addiction among youth

mother punishes son, mother lesson to ganja habit son, mother chilli powder punishment to son, kodad mother unties son to pole, kodad mother punishes son for having ganja, Telangana mother chilli powder punishment, kodad, suryapet, Ganja Addiction, Son, Mother, chilli powder, eyes, face, Punishment, Promise, viral video, Telangana, Crime

A woman in Telangana rubbed chilli powder in her son’s eyes after tying him to a pole to punish him for his ganja (cannabis) addiction. The video of the incident that occurred at Kodad in Suryapet district of Telangana went viral on social media. Worried over her 15-year-old son turning a ganja addict, the woman tied him to a pole. Not stopping at that, she rubbed chilli powder in his eyes even as another woman held his hands.

ITEMVIDEOS: గంజాయి తాగే మైనర్ కొడుకుకు బద్ది చెప్పిన తెలంగాణ తల్లి..

Posted: 04/05/2022 12:38 PM IST
Suryapet mother s chilli powder punishment answer to curb ganja addiction among youth

రెక్కాడితే కానీ డొక్కాడని దిగువ మధ్యతరగతి వర్గాలతో పాటు పేద వర్గాలకు చెందిన తల్లిదండ్రులకు తమ పిల్లలు తమలా కష్టపడకూడదని.. వారు విద్యాబుద్దులతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తుంటారు. అందుకు వారు పస్తులు ఉంటారే కానీ.. తమ కష్టం తమ బిడ్డలకు తెలియనీయరు. అయితే ఇలాంటి కుటాంబాలకు చెందిన పిల్లలు కూడా తాము తల్లిదండ్రులకు భారంగా మారకూడదని తమ వంతుగా కుటుంబానికి అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. పదో తరగతి పూర్తికాగానే ఇంటర్ చేయడంతోనే ఏదో ఒక పని చేస్తూ కుటంబానికి అండగా నిలుస్తుంటారు.

అయితే ఈ కుటుంబాలకు చెందిన కొందరు సంతానం మాత్రం పెడద్రోవ పడతారు. అందుకు తల్లిదండ్రులు తమ పనులలో నిమగ్నం కావడం కూడా కారణమే. రిక్షా కార్మికుడైన తన తండ్రి ఉదయమే రిక్షాను తీసుకుని బయటకు వెళ్తాడు. ఇక తల్లి దినసరి కూలి. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. ఇద్దరు కష్టపడి ఆడపిల్లకు కొద్దికాలం క్రితం పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపారు. ఇక రెండో సంతానమైన తమ మగబిడ్డ ఇప్పడు పదిహేను సంవత్సరాలు. కొడుకు మంచిగా చ‌దువుకుంటున్నాడని బడికి పంపుతున్నారు. మంచి ఉద్యోగం సాధించి ఉన్న‌త‌ స్థానంలో ఉండాల‌ని ఆరాట‌పడింది. అయితే అతను మాత్రం చెడు సావాసంతో చేతికందకుండా పోతున్నాడు.

ప్రతీ రోజు పాఠశాలకు వెళ్తున్నానని చెబుతున్న పిల్లాడు.. గంజాయి తాగుతూ ఇంటికి తిరిగివస్తున్నాడు. ఈ విషయం గమనించిన తల్లి తన బిడ్డే కదా అని తొలుత మంచిగా సముదాయించింది. మానేస్తానని మాట ఇస్తూనే తప్పుతూ మళ్లీ గంజాయి తాగే మత్తులో మునుగుతున్నాడు. తన క‌ళ్ల‌ముందే తన కొడుకు పనికిరాకుండా పోతున్నాడని ఆ తల్లి కన్నీరు పెట్టుకుంది. చిన్నగా కొట్టింది అయినా కొడుకు మాత్రం అలవాటు మానలేదు. తాను క‌న్న క‌ల గంజాయి రూపంలో ఆవిర‌వుతుంటే ఆ త‌ల్లి త‌ట్టుకోలేక‌.. మమకారం చంపుకోలేక పోయింది. అంతే కొడుకును ఎలాగైనా దారికితెచ్చుకోవాల‌ని గంజాయి తాగి ఇంటికి వచ్చిన కొడుకును స్థంబానికి కట్టివేసింది.

అక్కడితో ఆగకుండా బాలుడి కళ్లలో కారం పోసింది. అయితే అతను ప్రతిఘస్తున్న క్రమంలో పక్కింటి వారు వచ్చి బాలుడి చేతులు పట్టుకోవడంతో.. ఆ తల్లి తన బిడ్డ కళ్లలో కారం వేసింది. దీంతో కారం దాటికి కళ్లు మంట మండుతుండగా బాలుడు విలవిలలాడటంతో స్థానికులు నీళ్లు పోయండీ అని చెప్పినా.. ఆ తల్లి మాత్రం తన కోడుకు మళ్లీ గంజాయి జోలికి వెళ్లనని చెప్పి ప్రమాణం చేసేంతవరకు శాంతించలేదు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో జ‌రిగింది. కాసింత కఠినంగానే అనిపించిన తల్లి చర్యలు ఇప్పడు సభ్యసమాజంలో చర్చనీయాంశంగా మారాయి.

తల్లి తన బాలుడిని ఇలా శిక్షించవచ్చునా.. ఇది బాలల హక్కులకు విఘాతం కలిగించడం కాదా.? అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే తెలిసీతెలియక తప్పడు పనులను చేసే పిల్లలను సక్రమ మార్గంలోకి తెచ్చుకోవడంలో కళ్లలో కారంపెట్టడం అన్నది తెలంగాణ తల్లులకు తెలిసిన పురాతన విద్య అన్న సమర్థనలు కూడా వినిపిస్తున్నాయి. గంజాయికి బానిసైన కొడుకును అలానే వదిలేసి సంఘవిద్రోహశక్తిగానో లేక సమాజానికి పనికిరాని వాడిగానో మార్చడం కంటే.. తన బిడ్డను కాస్త కఠినంగానే తన తల్లి సన్మార్గంలోకి తెచ్చుకోవడం శుభసూచక ముందస్తు చర్యగా మరికొందరు అభివర్ణిస్తున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodad  suryapet  Ganja Addiction  Son  Mother  chilli powder  eyes  face  Punishment  Promise  viral video  Telangana  Crime  

Other Articles