Job Vacancy In NTPC2022: No Exam Needed, Salary Of Rs. 90,000 ఎన్టీపీసీ సంస్థలో ఉద్యోగాలు.. నెల వేతనం రూ.90వేల పైనే..!

Ntpc recruitment 2022 apply for several executive posts on careers ntpc co in details here

NTPC recruitment, NTPC Recruitment 2022, NTPC Limited, NTPC jobs, ntpc.co.in, ntpc, sarkari naukri, government jobs, ntpc, Executive posts, engineering jobs, NTPC recruitment, NTPC Recruitment 2022, NTPC Limited

NTPC Limited has invited applications for various Executive posts. Interested candidates can apply on the official website at careers.ntpc.co.in. The last day to submit the application forms is April 8. The recruitment drive will fill a total of 55 vacancies in NTPC.

ఎన్టీపీసీ సంస్థలో ఉద్యోగాలు.. నెల వేతనం రూ.90వేల పైనే..!

Posted: 04/04/2022 01:37 PM IST
Ntpc recruitment 2022 apply for several executive posts on careers ntpc co in details here

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకో చక్కని అవకాశం. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.90 వేల వేతనం లభించనుంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్​టీపీసీ) నుంచి కీలక నోటిఫికేషన్ విడుదలైంది. 55 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది ఎన్​టీపీసీ. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్-ఓ అండ్ ఎం, ఆపరేషన్స్ పవర్ ట్రేడింగ్, బీడీ పవర్ ట్రేడింగ్ శాఖలలో ఈ 55 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భారీగా జీతం లభించనుంది.

• దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 8 2022
• నోటిఫికేషన్ తేదీ: ఏప్రిల్ 1, 2022
• విద్యార్హతలు: ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ పట్టా ఉండాలి. కనీసం 60శాతం మార్కులు వచ్చి ఉండాలి.
• వయసు 35ఏళ్ల లోపు ఉండాలి.

ఎన్టీపీసీ ఆన్ లైన్ ధరఖాస్తు విధానం:
* ఎన్​టీపీసీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లాలి. ఓపెనింగ్స్ సెక్షన్​ను ఎంచుకోవాలి.
• careers.ntpc.co.in పేరుతో వెబ్​సైట్ ఉంటుంది. ఇందులోనే దరఖాస్తును సమర్పించాలి.
• వెబ్​సైట్​లోని జాబ్స్ సెక్షన్​పై క్లిక్ చేయాలి. అనంతరం మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ అప్లై మీద నొక్కితే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది.
• ఏ జాబ్​కు అప్లై చేస్తున్నారో ఎంచుకొని దరఖాస్తు ప్రారంభించాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.90 వేల వేతనం చెల్లిస్తారు. దీనికి అదనంగా సంస్థ తరఫున ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది. ఉద్యోగితో పాటు భాగస్వామి, ఇద్దరు పిల్లలకు వైద్య సేవలు అందిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles