Elephants chase bike riders in Tirumala పాపవినాశనం రోడ్డులో బైకర్లను వెంబడించిన ఏనుగులు

Elephants chase bike riders in tirumala at pamavinashanam road viral video

Elephants chase bikers on Thirumala Papavinasanam Road, Elephants hulchul on the tirumala Papavinasanam Road, Elephants chase bikers, Elephants, Bikers, Tirumala, Papavinasanam Road, Papavinasanam toll gate, Elephants hulchul, Elephants chasing bikers, tirumala news

A herd of elephants created a ruckus in Tirumala by chasing the devotees and now the video is going viral on social media. According to the sources, a herd of elephants wandering near Pamavinashanam toll gate. From the video, a herd of elephants are crossing the road and suddenly one of them chased a biker for a while.

ITEMVIDEOS: తిరుమల పాపవినాశనం రోడ్డులో బైకర్లను వెంబడించిన ఏనుగులు

Posted: 03/31/2022 02:16 PM IST
Elephants chase bike riders in tirumala at pamavinashanam road viral video

తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగే వేసవికాలంలో ఇక్కడ గజరాజులు కూడా చేరుకుని హల్‌చల్‌ చేస్తున్నాయి. గత వారం రోజులుగా చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు గ్రామాలలోకి ప్రవేశించి.. ఓ వైపు పంటను నాశనం చేస్తూనే.. మరోవైపు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శేషాచలం అడువుల్లోంచి తిరుమలకు చేరుకున్న గజరాజులు అక్కడ నాలుగు రోజులుగా తిష్టవేసి.. భక్తులను కలవరపెడుతున్నాయి. తిరుమల నుంచి పాపవినాశనంకు వెళ్లే రహదారిలో రోడ్డులో టోల్ గేట్ సమీపంలో తిష్ఠ వేసిన గజరాజులు ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి.

అయితే గజరాజులు వున్నాయన్న సమాచారం అందుకున్న స్థానికులు కాసింత జాగ్రత్తగా వ్యవహరించి.. తమ ద్విచక్రవాహనాలపై వెళ్తూ.. తమ సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగ్ అప్షన్ ను అన్ చేసుకుని పాప వినాశనం మార్గం మీదుగా ఆకాశగంగకు చేరుకునేందుకు వెళ్లారు. అలా వెళ్తుండగా, టోల్ గేట్ సమీపిస్తుందన్న సమయంలో వారికోసమే అన్నట్లుగా రోడ్డుపైనున్న చెట్ల చాటున మాటువేసిన గజరాజు వారు సమీపించగానే ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వారు వెంటనే వెనక్కు తిప్పుకుని వస్తుండగా, గజరాజు కూడా కొంతదూరం వారిని వెంబడించింది. ఆ వెంటనే మరో ఏనుగు కూడా వారికోసం రోడ్డుపైకి వచ్చింది.

దీంతో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తి వెగంగా వెళ్లు.. అని వాహనచోదకుడికి చెప్పడం వీడియోలో వినిపించింది. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి.. తనపై దాడి చేసేందుకు యత్నించిన ఏనుగుల నుంచి తప్పించుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏనుగు కొంతదూరం వెంబడించడంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఏనుగులను అరణ్యంలోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు సఫలమయ్యాయి. దీంతో కొద్ది సమయం తరువాత ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించిన తరువాత రాకపోకలకు అధికారులు అనుమతిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles