Will give Jalak to Revanth soon: Jagga Reddy రేవంత్ కు తగు సమయంలో జలక్ ఇస్తా: జగ్గారెడ్డి

Jagga reddy blames revanth for the present situation in congress

T.Jagga Reddy, Sangareddy MLA, TPCC Working President, A Revanth Redddy, TPCC chief, New Delhi, Parliament session, V Hanmanth Rao, Sridhar babu, Bhatti Vikramarka, Marri Shashidhar Reddy, Komatireddy Venkat Reddy, Sonia Gandhi, Rahul Gandhi, Telangana Congress Telangana, Politics

Congress MLA Jagga Reddy said that he has no issues in working with TPCC Revanth Reddy. During a press meet, the Sangareddy MLA said that some persons from the party is defaming him on social media. He spoke about his differences with TPCC president Revanth Reddy, meetings of Congress senior leaders and the developments of the party.

ముత్యాలముగ్గులో హీరోయిన్ పరిస్థితి నాది: జగ్గారెడ్డి అవేదన

Posted: 03/22/2022 03:31 PM IST
Jagga reddy blames revanth for the present situation in congress

మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంటుగా వున్న తనను కలుపుకుని పోకపోవడం వల్లే.. తనకు ఆయనపై కోపం వచ్చిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి రేవంత్ రెడ్డి మాత్రమే కారణమని.. కలుపుకుని వెళ్లకుండా.. ఆయనే దూరం పెడుతున్నారని పేర్కోన్నారు. అయినా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. సోనియాగాంధీ, రాహుల్ చేత టీపీసిసిగా నియమించబడిన నేతతో కలసి పనిచేస్తానని ఆయన చెప్పారు.

కాగా తమ మధ్య అంతరం పెరగడానికి రేవంత్ మెదక్ పర్యటనే బీజం వేసిందని అన్నారు. రేవంత్ మెదక్ వెళ్తున్నప్పుడు తనను ఆహ్వానించలేదని.. అందుకే కోపం వచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్​లో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా.. పార్టీ బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని ఏఐసీసీ తప్పించింది. ఇటీవల రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన జగ్గారెడ్డి.. ఇవాళ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా తప్పించడంపై స్పందించడంతో పాటు పీసీసీ అధ్యక్షుడి తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. కానీ తనను నిర్లక్ష్యం చేయడమే నచ్చలేదని వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోనియాగాంధీ కుటుంబం వల్లే కాంగ్రెస్‌ గొప్ప స్థాయికి చేరిందన్నారు. రాజీవ్‌గాంధీని చంపిన వారికి క్షమాభిక్ష సూచించిన గొప్ప కుటుంబం సోనియాగాంధీ అని కొనియాడారు. కానీ కాంగ్రెస్‌లోని కొందరు సోషల్‌ మీడియా ద్వారా తన పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీపై అభిమానంతోనే ఎప్పట్నుంచో ఇదే పార్టీలో ఉన్నానని వెల్లడించారు. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌తో తనకు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు.

ఏపీ విభజన వద్దని నిజం మాట్లాడి తెలంగాణ ద్రోహిగా పేరు మోశానన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజల ఆగ్రహం చూడాల్సిన రోజుల్లోనూ ధైర్యంగా మాట్లాడినట్లు గుర్తు చేశారు. ఏ ఆలోచన లేని శ్రీధర్‌బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ పదవుల నుంచి తొలగించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు ఝలక్‌ ఇవ్వటం కాదని.... తానే తగు సమయంలో రేవంత్ కు అసలైన షాక్ ఇస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు తనకు రేవంత్‌రెడ్డికి మధ్య మాత్రమేనని... కాంగ్రెస్‌కు సంబంధంలేదని ఆయన వివరణ ఇచ్చారు.

పార్టీలో కలిసి సాగుదామని రేవంత్‌ ఏనాడు తనకు చెప్పకపోగా.. అనుచరులతో తనపై కోవర్టని ముద్ర వేయిస్తున్నారని వాపోయారు. ఇటీవల సీఎల్పీలో రేవంత్‌రెడ్డి తానూ కలిసినప్పుడు.. ఇద్దరూ కలిసిపోయారని అనుకునేలా ఫొటోలు బయటికి వచ్చాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ తనను బుజ్జగించాడని అందరూ అనుకున్నారని.. కానీ కలిసి పనిచేద్దామని కూడా ఆయన తనతో ఏనాడు అనలేదని తెలిపారు. ఇది ఏకంగా  ముత్యాల ముగ్గులో కథానాయిక మాదిరి కాంగ్రెస్‌లో తన పరిస్థితి మారిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles