Sri Lanka cancels school exams over paper shortage పేపర్ కొరతతో విద్యార్థుల పరీక్షలు రద్దు చేసిన సర్కార్

Sri lanka cancels school examinations due to paper shortage amid financial crisis

sri lanka, economic crisis, paper shortage, exams canceled, gotabaya rajapaksa, international monetary fund, imf, china, beijing, Crude Oil, energy, power, u.s.,asia, economic crisis, food crisis

Sri Lanka cancelled exams for millions of school students as the country ran out of printing paper with Colombo short on dollars to finance imports, officials said. Education authorities said the term tests, scheduled a week from Monday, were postponed indefinitely due to an acute paper shortage as Sri Lanka contends with its worst financial crisis since independence in 1948.

శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం..

Posted: 03/21/2022 06:59 PM IST
Sri lanka cancels school examinations due to paper shortage amid financial crisis

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చికెన్‌, బియ్యం, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు అన్నీ అకాశానంటుతున్నాయి. గ్యాస్‌ ధరలు అందుకోలేని స్థాయికి చేరాయి. దీంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. ఇక అత్యంత ముఖ్యమైన ఇంధన ధరలు కూడా ఈ ప్రభావానికి గురవుతున్నాయి. ఓ వైపు ఇంధన ధరలు కూడా ఆశాకాన్ని అంటడంతో ప్రజలు తప్పనిసరి అయితేనే వాహనాలను సొంత వినియోగిస్తున్నారు. లేదా ప్రజా రవాణాపైనే అధారపడుతున్నారు. 1990 సంక్షోభం కంటే మరింత దారుణమైన పరిస్థితులు శ్రీలంకలో ఉన్నట్లు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో కోడిగుడ్డు ధర రూ.35, కాగా కిలో చికెన్ ధర ఏకంగా రూ.1000, కిలో పాలపొడి డబ్బా ధర ఏకంగా రూ.2000, లీటర్ కొబ్బరినూనే ధర రూ.900.. ధరలు ఏకంగా ఇంతగా ఎగబాకడానికి అక్కడి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణం. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు సుమారు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులకు అందకుండా కొండెక్కి కూర్చున్నాయి.

ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉల్లిపాయలు రూ.200 నుంచి రూ.250, కేజీ పాల పొడి రూ.1,945., కేజీ గోధుమ పిండి రూ.170 నుంచి రూ.220 మధ్య అమ్ముతున్నారు. లీటర్‌ కొబ్బరి నూనె ఏకంగా.. 900 నుంచి 1000 రూపాయల మధ్య పలుకుతోంది. ఈ ధరల నేపథ్యంలో అక్కడి ప్రజలు ఏం తినేది.. ఎట్టా బతికేది అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వాలు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఇక ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు చేరింది. ఫలితంగా నిత్యవసర సరుకులతో పాటు ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి.

ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్‌ 283 రూపాయలకు చేరగా లీటర్ డీజల్‌ను రూ.220కి విక్రయిస్తున్నారు. అటు వంట గ్యాస్‌ కొరత కారణంగా.. శ్రీలంకలోని 90శాతం హోటళ్లు మూతపడ్డాయి. 1970లో సంభవించిన కరవు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్నట్లు పెరదేనియా యూనివర్సిటీలో ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్ సంగరన్ విజేసంధిరన్ తెలిపారు. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు విధానమే, ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన ధరలకు.. ప్రభుత్వానిదే బాధ్యతంటూ గత కొన్ని రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ.. నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న కొలంబొలోని అధ్యక్ష భవంతని.. వందలాది మంది ప్రజలు ముట్టడించగా అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అటు విపక్షాలు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ప్రజల్లో పెల్లుబికిన నిరసన సెగలు ప్రభుత్వం గద్దె దించేందుకు నాంది పలికాయని విపక్ష నాయకుడు సజిత్‌ ప్రేమదాస అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles