Donkey ride for ‘newest son-in-law’ in Holi tradition హోలీ రోజున కొత్త అల్లుడు గాడిద ఎక్కాల్సిందే..!

On the day of holi the son in law sits on a donkey roams the whole village

donkey, soninlaw, holi tradition, village, holi, holi 2022, holi news, ancient tradition, donkey ride, son in law, Donkey ride, Holi tradition,Holi, Vida village, Beed district, Kej tehsil, aurangabad, Maharashtra

A village in Maharashtra’s Beed district continued its 90-year-old tryst with a Holi tradition in which the “newest son-in-law” gets a donkey ride and clothes of his choice at the end of it. The donkey ride of Vida village in Beed’s Kej tehsil, some 125 kilometres from here, is a much-awaited item of Holi for people from near and far, said resident Angad Dethe.

హోలీ రోజున కొత్త అల్లుడు గాడిద ఎక్కాల్సిందే..! ఊరంతా తిరగాల్సిందే.!!

Posted: 03/17/2022 05:49 PM IST
On the day of holi the son in law sits on a donkey roams the whole village

'ఫెస్టివల్ ఆఫ్ కలర్'గా పిలువబడే హోలీ పండుగను దేశవ్యాప్తంగా చిన్నా, పెద్ద ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. అయితే స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా సెలబ్రేషన్స్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఈ మేరకు కొన్ని ఆచారాలు ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర, బీడ్ జిల్లాలోని ఓ గ్రామంలో శతాబ్ద కాలం నుంచి ఒక విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. దీని ప్రకారం గ్రామంలోని 'కొత్త అల్లుడు' హోలీ రోజున గాడిదపై స్వారీ చేయాల్సి ఉంటుంది.

ఔరంగాబాద్ నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో జరిగే హోలీ వేడుకల కోసం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మూడు, నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆ గ్రామానికి చెందిన కొత్త అల్లుడిని గాడిదపై స్వారీ చేయిస్తారు. అంతేకాదు ఈ ఘట్టం నుంచి అతను తప్పించుకోకుండా ఉండేందుకు గ్రామస్తులంతా కాపు కాస్తుంటారు కూడా. ఇక గ్రామం నడిబొడ్డు నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రైడ్.. చివరకు హనుమాన్ టెంపుల్ వద్ద కొత్త అల్లుడికి బట్టలు బహూకరించడం ద్వారా ముగుస్తుంది. కాగా స్థానికులు దైవంగా కొలుచుకునే ఆనందరావు దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తుండగా.. ముందుగా అతని అల్లుడితోనే ప్రారంభించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles