Reporter hit by bike during live coverage on Holi హోలి పండగ రోజున లైవ్ రిపోర్టింగ్ చేయాలంటే కష్టమే..

Old funny video goes viral reporter hit by bike during live coverage on holi

news reporter, live coverage, funny accident, Holi, Bhopal, Madhya Pradesh, social media, viral video, video viral

An Old video has gone viral on social media for all the right reasons on the right occassion. The video shows a reporter is interviewing the views of some youth at bhopal of Madhya Pradesh. He says that these guys are on a ride to enjoy the holi, then suddenly a bike comes to his side and hit him. Luckily he was not injured.

ITEMVIDEOS: హోలి పండగ రోజున లైవ్ రిపోర్టింగ్ చేయాలంటే కష్టమే..

Posted: 03/17/2022 01:41 PM IST
Old funny video goes viral reporter hit by bike during live coverage on holi

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల: అవుతోంది. సరిగ్గా సందర్భం చూసుకుని కొందరు ఈ వీడియోలను అప్ లోడ్ చేయడంతో పాత వీడియోలు కూడా ఒక్కోసారి తెగ వైరల్ అవుతుంటాయి. సరిగ్గా అలాగే ఈ పాత వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో, అటు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమీటా వీడియో.. ఐనా పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యేంత సందర్భం ఏమీటీ అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. ఇది ఏకంగా ఆరేళ్ల క్రితం వీడియో. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు కాలేదు కానీ.. ఇదే వీడియో కరోనా సమయంలో మాత్రం విపరీతంగా వైరల్ అయ్యింది.

ఆ తరువాత మళ్లీ రెండేళ్ల తరువాత ఇప్పుడ మళ్లీ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియో ఏంటీ.. దాని సందర్భమేంటీ అని అంటారా.? హోలీ పండగే సమీపించడమే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది.? అంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని బోపాల్ లో ఓ రహదారిపై ఓ రిపోర్టర్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాడు. అదీ హోలీ పండగ రోజున అక్కడి యువత ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే దానిపై అక్కడి యువతను అడిగి తెలుసుకుంటున్నాడు. ఈ క్రమంలో యువత జోష్ తో పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారని, వారు బైక్ లపై తిరుగుతూ హోలీ సంబురాలను.. తమ స్నేహితులతో కలసి పంచుకుంటున్నారని చెప్పాడు.

ఈ క్రమంలో యువతను అక్కడి నుంచి హోలీ వెళ్తుండగా..  క్రమంలో రోడ్డుపై నుంచి వేగంగా ఓ బైక్ పై దూసుకోచ్చిన యువకుడు నేరుగా రిపోర్టర్ నే ఢీకోట్టి పడిపోయాడు. అయ్యే లైవ్ కవరేజ్ లో పడిపోయానే అనుకుంటూ లేచిన రిపోర్టర్ తలతిప్పి కెమెరామెన్ వైపు చూడగా అయిన బిజీగా షూట్ చేస్తూనే వున్నాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబధించిన వీడియో ఓ వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నవ్వుల పుప్పులు పూయిస్తూ వీడియో వైరలవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : news reporter  live coverage  funny accident  Holi  Bhopal  Madhya Pradesh  social media  viral video  video viral  

Other Articles