Unique gang of thieves, used to work on salary దొంగల కంపెనీ: నెల జీతం.. బోనస్.. ఇన్సెంటివ్ ఇలా మరెన్నో..

Unique gang of thieves used to work on salary got target like a corporate company

stealing the vehicle, cutting the vehicle, selling vehicle as scrap, vicious gang, two-wheelers, bikes, scooties, batteries, e-rickshaws, Shastri area, Team leader, salaries, corporate office, incentives, commissions, bonus, Jaipur Police, Rajasthan, Crime

The Jaipur Police of Rajasthan has arrested a gang of very vicious thieves. According to the information received from the police, the gang leader used to give a target to these miscreants every day. They had to commit a theft every day. Salary was given up to 30 thousand.

దొంగల కంపెనీ: నెల జీతం.. బోనస్.. ఇన్సెంటివ్ ఇలా మరెన్నో..

Posted: 03/16/2022 07:11 PM IST
Unique gang of thieves used to work on salary got target like a corporate company

అదో కంపెనీ.. అయితే అక్కడ అందరికీ ఉద్యోగాలు లభించవు. కేవలం ఆర్థిక స్థితి సరిగ్గాలేని కుటుంబాల యువతకు మాత్రమే ఆ కంపెనీ ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇక ఈ కంపెనీలో ఉద్యోగులకు టార్గెట్ పూర్తి చేసిన కోద్దీ ఇన్ సెంటివ్ లు, కమీషన్లు కూడా లభిస్తుంటాయి. అయితే కంపెనీలు ఏం ఉద్యోగం చేయాలన్నది మాత్రం టీమ్ లీడర్ నిర్ధేశిష్తారు. ఔనా.. అంటే కాదని చెప్పలేం. అయితే వీరి టార్టెగ్ దొంగతనాలు. వినడానికే అశ్చర్యకరంగా వుందా.? దొంగతనాలను కూడా ఓ ఉద్యోగంలో చేస్తోంది ఓ ముఠా. ఆ ముఠా గ్యాంగ్ లీడర్ రోజూ దొంగతనానికి టార్గెట్ ఇస్తాడు.

టార్గెట్ పూర్తి చేసిన వాళ్లకు బోనస్‌లు, ఇంక్రిమెంట్‌లు ఇలా ఎన్నో ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాడు. మరి ఇలా దొంగలించిన వాహనాలను వారేం చేస్తారు అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. వాహనాలను దొంగిలించడం, వాటిని ఏ బాగానికి ఆ భాగం విడదీయడం, ఆ విడిభాగాలను బయట విక్రయించడం, మిగిలిపోయిన వస్తువులను డంపింగ్ చేయడం. వీటికి కోసం అతను ప్రత్యేక నెలవారీ ప్యాకేజీను ఉద్యోగులకు ఇస్తున్నాడు ఓ ఘనుడు. చివరికి జైపూర్‌ పోలీస్ స్టేషన్ 10 మంది దుండగులను పట్టుకోవడంతో ఆ ముఠా అసలు బండారం బయటపడింది.

పోలీసులే విస్తుపోయేలా ఈ ముఠా దోంగతనాలకు పాల్పడింది. ఇక ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి దొంగలించిన సామాగ్రిని స్వాధీనం చేసుకుని ఆశ్చర్యపోయారు. ముఠా సభ్యుల నుంచి స్కూటీలు, బ్యాటరీలు, ఈ-రిక్షాలు సహా డజన్ల కొద్దీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చాలా మంది నిరుద్యోగులకు డబ్బు ఎర చూపి వారి ఆర్థిక పరిస్థితులను అవకాశంగా చేసుకుని దొంగతనాలకు ప్రేరేపించి వాళ్లను దొంగలుగా మారుస్తున్నాడు.

ఈ ముఠా.. అదును చూసి ఈ-రిక్షాలు, బైక్‌లు మాయం చేస్తారు. ఆ తర్వాత వాటి ఇంజిన్లను తీసి టైర్లు, బ్యాటరీలు వీడిగా చేయడంతో ఆ వాహనాన్ని తక్కుకింద మారుస్తారు. కాగా దొంగలు ఎవరు ఏం పని చేయాలనే ముందుగానే ఆ గ్యాంగ్‌ లీడర్‌ నిర్ణయిస్తాడు. ఇలా ప్రతీది ఓ ప్లాన్‌ ప్రకారం చేసి వందలాది బైకులను అమ్మి సొమ్ము చేసుకుంటోంది ఆ ముఠా. కాగా ఇలాంటి ఓ దొంగల కంపనీని 2018లో సైతం ఓ క్రిమినల్ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా బయటపడ్డ దొంగలకు మాత్రం నెలకు 30 వేల రూపాయలు ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles