seethakka fires on chinna jeeyar swamy చిన్నాజియ్యార్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్.!

Mla seethakka demands apology from chinna jeeyaar swamy on his comments on samakka sarakka

MLA Seethakka Fires On Chinna Jeeyar Swamy, Chinna Jeeyar Swamy Comments on sammakka sarakka jatara, MLA Seethakka, Chinna Jeeyar Swamy, derogatory Comments, sammakka sarakka jatara, Medaram Jatara, Samatha murthy, Muchinttal, Telangana

Medaram Jatara his a tribal and backward class feast, the biggest feast in Asia continent, but Chinna jeeyaar swamy had made derogatary remarks over this feast. MLA Seethakka Fires On Chinna Jeeyar Swamy Comments Over sammakka sarakka jatara, questions over ticket price to visit samatha murthy idol at Muchinttal.

ITEMVIDEOS: వనదేవతలపై వ్యాఖ్యలను తకణం ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్యే సీతక్క

Posted: 03/16/2022 01:43 PM IST
Mla seethakka demands apology from chinna jeeyaar swamy on his comments on samakka sarakka

ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరను చిన్నజీయర్ స్వామి అవమానించారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మేడారం జాతరపై బిజినెస్ చేస్తున్నారంటూ జీయర్ స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్పందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.. తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. '' ఓ ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు. మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు.

కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతామూర్తి విగ్రహం చూడడానికి మాత్రం ఒక్క మనిషికి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. వ్యాపారం ఎవరిది.. వ్యాపార దోరణి ఎవరిది.? అని అమె ప్రశ్నించారు. మేడారం జాతరపై, వనదేవతలైన సమ్మక్క, సారక్కలపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే చిన్న జీయర్ స్వామి  బేషరతు క్షమాపణ చెప్పాలని అమె డిమాండ్ చేశారు. తల్లుల కీర్తి ప్రతిష్టలను సహించలేక మాట్లాడిన దుర్మార్గపు మాటలను తక్షణం ఉపసంహరించుకోవాలని అన్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించాలని కోరారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న సమక్క సారక్క కీర్తిని తగ్గించి మాట్లాడిన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలి.'' అంటూ సీతక్క వీడియోలో తెలియజేశారు.



సమ్మక్క సారక్కపై చిన్న జీయర్ స్వామి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి, గిరిజన నేత పి.రఘు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అడవి దేవతలైన సమ్మక్క సారక్కను ఉద్దేశపూర్వకంగా అవమానించిన చిన్న జీయర్ స్వామి కళ్ళు నెత్తికెక్కాయని విమర్శించారు. ఆశ్రమాలు, ఆధ్యాత్మికత పేరిట వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను గుప్పిట్లో పెట్టుకుని చిన్న జీయర్ స్వామి రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తన సమతా మూర్తి పర్యాటక కేంద్రాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న అక్కసుతోనే సమ్మక్క సారక్కలపై అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. ఆత్మగౌరవ పోరాటానికి సూచిక లైన వన దేవతలు సమ్మక్క సారక్కను విమర్శిస్తే గిరిజన సమాజం ఊరుకోదని హెచ్చరించారు. సమతా మూర్తి పేరుతో 120 కిలోల బంగారు విగ్రహం పెట్టి.. అది చూడటానికి వచ్చిన వారి నుండి రూ.150 టికెట్ పెట్టి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సమతా మూర్తి పేరుతో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. మా తల్లుల దగ్గర ఎటువంటి టికెట్ లేదని, సమ్మక్క సారక్క దగ్గర ఎలాంటి వ్యాపారం జరగదని నొక్కివక్కానించారు.

లక్ష రూపాయలు తీసుకోకుండా మీరెప్పుడైనా పేద వారి ఇంటికి వెళ్ళారా అని ప్రశ్నించారు ? వ్యాపారధోరణి ఎవరిది.. మీదా..? మా వనదేవతలదా..? అని నిలదీశారు. చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. సాధువుగా నీకు దేవతామూర్తులను కించపర్చరాదు అన్ని విషయం తెలియదా.? అని ప్రశ్నించారు. విమర్శలు మానుకోకపోతే ముచ్చింతల ఆశ్రమాన్ని ముట్టడిస్తామని, చిన్న జీయర్ స్వామిని బయట అడుగు పెట్టనీయబోమని హెచ్చరించారు. బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఆశ్రమాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles