Actress Rupa Dutta Arrested For 'Theft' నటి రూపా దత్తాపై దొంగతనం అభియోగాలు.. అరెస్టు

Actor rupa dutta arrested for theft at kolkata book fair

Rupa Dutta, Rupa Dutta arrested, Kolkata book fair, Anurag Kashyap, International Kolkata Book Fair,Rupa Dutta, Rupa Dutta arrested, Kolkata Book Fair, Anurag Kashyap, International Kolkata Book Fair, Rupa Dutta pickpocketing, Rupa Dutta controversy, Anurag Kashyap, International Kolkata Book Fair, Kolkata, crime

Actress Rupa Dutta was arrested for allegedly committing attention diversion theft at the venue of the International Kolkata Book Fair, Kolkata police informed. According to sources Rupa Dutta was arrested after a policeman saw her throwing a purse into a dustbin, an officer of Bidhan Nagar North police station as saying.

నటి రూపా దత్తాపై దొంగతనం అభియోగాలు.. అరెస్టు

Posted: 03/14/2022 01:43 PM IST
Actor rupa dutta arrested for theft at kolkata book fair

అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనకు హాజరైన పుస్తక ప్రేమికుల దృష్టిని మళ్లించిన అమె వారి నుంచి పర్సులను తస్కరించి అందులోని నగదును తీసి తన బ్యాగ్ లో వేసుకని పర్సును మాత్రం అక్కడి చెత్తబుట్టలలో పడేసేది. ఇలా అమె ఓ పర్సును విసిరేస్తుండగా, ఓ పోలీసు అధికారి గమనించాడు. అమె ఇలానే మరో పర్సును తస్కరించి అందులోని నగదును తీసి తన బ్యాగులో పెట్టుకుని పర్సును విసిరేస్తుండగా ఆయన అమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకన్న అనంతరం నటి రూపా దత్తాను విచారించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో... వారికి అనుమానం మరింత బలపడింది. దీంతో, ఆమె బ్యాగ్ ను తనిఖీ చేయగా రూ. 75 వేల నగదుతో పాటు కొన్ని పర్సులు కనిపించాయి. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కోల్‌కతా నగరంలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనకు హాజరైన పుస్తక ప్రేమికుల దృష్టిమరల్చి దోంగతనానికి పాల్పడిన (కెప్మారి) నేరం కింద నటి రూపా దత్తాను అరెస్టు చేసినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు.

రూపా దత్తాను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. కాగా, అమెను విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటీషన్ ను విచారించి స్వీకరించిన న్యాయస్థానం రూపాదత్తాను ఒక్క రోజు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదేశాలు జారీ చేసిందని బిధాన్ నగర్ నార్త్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. నటిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె సమాధానాల్లో వ్యత్యాసాలు కనిపించాయి. కాగా ఈ దొంగతనాలతో ఎంత మంది వ్యక్తులు సంబంధం ఉందో విచారణలోనే తెలుస్తుందని అన్నారు. కాగా 2020లో ఈ నటి చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అనురాగ్ కశ్యప్ తనకు ఫేస్ బుక్ లో అనుచిత సందేశాలు పంపారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles