AP Govt Key Desicion on Late comming Employees ప్రభుత్వ ఉద్యోగులపై ఏపీ సర్కార్ కఠిన నిబంధనలు

Andhra pradesh government key desicion on late comming employees

Andhra Pradesh Employees, AP Government, AP Govt new rules to employees, AP Govt new rules to secretariat employees, Government Employees, new rules, late comers, abscent, leave without informing, Disciplinary action, AP Govt, AP Employees, Andhra Pradesh, Politics

Andhra Pradesh government took another key decision in regarding with employees. After the employees revolt against the government with the pay revision commission, the govt is implimenting fixed time shedule to secretariat employees. It gives only 10 minutes as grace period and the late comers after the 10 minutes will be marked as leave.

ఆలస్యమైతే.. ఆ రోజు సెలవే.. ఉద్యోగులపై ఏపీ సర్కార్ కఠిన నిబంధనలు

Posted: 02/26/2022 04:25 PM IST
Andhra pradesh government key desicion on late comming employees

రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులు నిర్ణీత సమ యంలోగా కార్యాలయానికి రావాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌–19 తరువాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్ల సచివాలయ ఆర్థిక శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ పని దినాల్లో ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి రావాలని, సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా రాని అధికారులకు, ఉద్యోగులకు ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని తెలిపారు.

* ఉదయం 10 నుంచి 10.10 గంటల్లోపు తప్పనిసరిగా విధులకు హాజరవడం తోపాటు పనిచేయడం ప్రారంభించాలి
* ఉదయం 10.10  నుంచి 11 గంటల్లోపు ఆలస్యంగా హాజరుకు నెలలో మూడు సార్లు మాత్రమే అనుమతి.
* ఒక పూట హాజరును ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరిగణిస్తారు
* ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంటలోపే వెళ్లిపోతే ఒక పూట సెలవుగానే పరిగణిస్తారు.
* మధ్యాహ్నం 1 గంట తరువాత హాజరైతే ఆ రోజు సెలవుగా లేదా గైర్హాజరుగా పరిగణిస్తారు
* ఉదయం 10 గంటలకు హాజరై సాయంత్రం 5.30 తరువాత కార్యాలయం నుంచి వెళ్తే పూర్తి రోజు హాజరైనట్లు
* ఉద్యోగులు ముందుగా అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంవల్ల పని వాతావరణం దెబ్బతింటోంది.  
* ఇక నుంచి సెలవుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకుండా సెలవు పెడితే అనధికార గైర్హాజరుగా పరిగణిస్తారు.
* ఒక పూట సెలవు కోసం ముందస్తు సమాచారం ఇవ్వాలి.
* అధికారులు, ఉద్యోగులందరూ పనివేళలను కచ్చితంగా పాటించాలి.
* క్రమశిక్షణను, పని వాతావరణాన్ని నెలకొల్పాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు
* కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా నిబంధనలు వర్తింపు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles