India’s smartphone Shoots Up భారతీయుల స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిస్తే షాక్ తప్పదు..

Indian kids teens more vulnerable than ever to smartphone threats report

mobile devices, smart phones, Gagan Singh, McAfee Executive Vice President, Children, teenagers, vulnerable, sophisticated mobile threats, low protection, risk at all-time high, '2022 Consumer Mobile Threat Report', cyber-security research, McAfee.

Children and teenagers are more vulnerable than ever to sophisticated mobile threats in India as the level of disconnect that exists between generations over how safe mobile devices are and how vulnerable consumers are to threats on those devices has increased significantly, a new report has shown.

భారతీయుల స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Posted: 02/25/2022 01:43 PM IST
Indian kids teens more vulnerable than ever to smartphone threats report

తరం మారింది. అంటే హలో అంటూ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని తిరగే తరం మారిపోయి.. పూర్తిగా స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. చంటి బిడ్డల నుంచి పెద్దవాళ్ల వరకు ఇప్పుడు అందరూ ఇంట్లోనే కూర్చోని తమ స్మార్ట్ ఫోన్ తో పలు సేవలను అస్వాదిస్తున్నారు. పెద్దలు కాసింత సైబర్ నేరగాళ్లకు జంకి పెద్దగా ఇతరాత్ర సేవలకు వినియోగించకపోయినా.. కేవలం మాట్లేందుకు వినియోగిస్తున్నారు. అయితే వీడియో కాల్, వాట్సాప్ కాల్ కోసం స్మార్ట్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. ఇక యువతీ యువకుల విషయానికోస్తే చెప్పనవసరం లేదు. వారికి చేతిలో ఫోన్ లేకపోతే.. ఏ పని తోచదన్నట్లుగా పరిస్థితులు మారాయి.

ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్ ఫోనే.. వార్త‌ల నుంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్.. కెరీర్ అంశాల‌ను చెక్ చేసుకోవ‌డానికి ఆధారం స్మార్ట్ ఫోన్‌. చంటిపిల్లలు అన్నం తినాలన్నా.. వారికి నచ్చిన పాట పెట్టుకుని వింటూనే మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. 2021లో భార‌తీయుల్లో ప్ర‌తి రోజూ స‌గ‌టున 4.42 గంట‌లు స్మార్ట్ ఫోన్‌తోనే గ‌డుపుతున్నార‌ని తేలింది. వినోద సాధ‌నం టీవీ చానెల్స్ 3.17 గంట‌లు మాత్ర‌మే వీక్షించార‌ని అమెరికా కేంద్రంగా రూపొందించిన అధ్య‌య‌న నివేదిక వెల్ల‌డించింది. స్మార్ట్ ఫోన్ అత్య‌ధికంగా వాడుతున్న వారిలో బ్రెజిలియ‌న్లు మొద‌టి స్థానంలో ఉన్నారు. వారు ప్ర‌తి రోజూ 5.24 గంట‌ల పాటు స్మార్ట్‌ ఫోన్ల‌తోనే కాల‌క్షేపం చేశారు.

యూఎస్ కేంద్రంగా ప‌నిచేస్తున్న యాప్ సంస్థ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్ర‌పంచదేశాల్లో మొబైల్ ఫోన్ల వాడ‌కంపై అధ్య‌య‌నం జ‌రిపింది. 2020తో పోలిస్తే చైనా, అర్జెంటీనాల్లో మొబైల్ ఫోన్ల వాడ‌కం త‌గ్గింది. చైనీయులు 2020లో 3.5గంట‌లపాటు స్మార్ట్ ఫోన్ల‌తో గ‌డిపితే, గ‌తేడాది 3.2గంట‌ల‌కు ప‌డిపోయింది. అర్జెంటీనాలో 3.8గంట‌ల నుంచి 3.6గంట‌ల‌కు ప‌డిపోయింది. భార‌త్‌లో క‌రోనావేళ స్మార్ట్ ఫోన్లు 120 కోట్లు పెరిగాయి. 2021 అక్టోబ‌ర్-డిసెంబ‌ర్ త్రైమాసికంలో ప్ర‌తి 10 నిమిషాల‌కు 4.6 నిమిషాలు సోష‌ల్ మీడియా, క‌మ్యూనికేష‌న్ యాప్స్‌ల‌పైనే కాలం వెళ్ల‌దీశారు. మ‌రో 3.5 నిమిషాలు ఫొటో, వీడియో, గేమింగ్ అండ్ ఎంట‌ర్‌టైన్మెంట్ యాప్స్‌, ఫొటో అండ్ వీడియో యాప్స్‌పై 2.5 నిమిషాలు గ‌డిపారు.

భార‌త్‌లో 2021లో డేటా డౌన్‌లోడ్ 10 శాతం పెరిగింది. డేటా డౌన్‌లోడ్‌లో చైనా త‌ర్వాత స్థానం భార‌త్‌దే. పాకిస్థాన్ (25శాతం) , పెరూ (25శాతం), ఫిలిప్పీన్స్ (25శాతం), వియ‌త్నాం (20శాతం)ల‌లో డౌన్‌లోడ్స్ పెరిగాయి. 2020లో అన్ని క్యాట‌గిరీల ఫైనాన్స్ యాప్స్ డౌన్‌లోడ్స్ శ‌ర‌వేగంగా 27 శాతం పెరిగితే, వాటి వాడ‌కం 46 శాతం వృద్ధి చెందింది. ఇక మెడిక‌ల్ యాప్స్ డౌన్‌లోడ్స్ 36 శాతం వృద్ధి చెందితే, వాటి వినియోగం 38 శాతం పెరిగింది. భార‌త్‌లో మొబైల్స్ మీద వినియోగ‌దారులు గ‌తేడాది 417 మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేశారు. 2020లో 503 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌డం గ‌మ‌నార్హం. చైనాలో 56 బిలియ‌న్ డాల‌ర్లు, అమెరికాలో 43 బిలియ‌న్ల డాల‌ర్లు, జ‌పాన్‌లో 21 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles