Revanth slams CM KCR over Budget fund release బడ్జెట్ కేటాయింపులు బారెడు.. నిధులు ఇంచెడు: రేవంత్

Tpcc revanth reddy slams cm kcr over budget allocation fund release

Revanth Reddy on budger allocations, revanth reddy on fund release to budger allocations, arrested second day, Revanth Reddy on KCR birthday, Revanth Reddy Golkonda police station, Revanth Reddy Twitter post viral, TPCC President, Komatireddy Venkat Reddy, Bhongir MP, Congress senior leader, Congress, Rival Political Parties, Nalgonda, telangana, Politics

Telangana pradesh congress committee president A Revanth Reddy fires on Chief Minister Kalvakuntla ChandraShekar Rao over release of Funds to the Budget allocations. This is how the government is cheating the people of Telangana, he added.

బడ్జెట్ పత్రాలను చిత్తుకాగితం చేసిన ఘనత కేసీఆర్ సర్కారుదే: రేవంత్

Posted: 02/18/2022 03:33 PM IST
Tpcc revanth reddy slams cm kcr over budget allocation fund release

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అసెంబ్లీలో బడాయిల కోసం.. ప్రజలను తప్పదారి పట్టించేందుకు బడ్జెట్ లో కోట్లరూపాయల కేటాయింపులు చూపించి ప్రచార అర్భాటం చేసుకోంటున్నారని.. కానీ.. అనేక కేటాయింపులకు నిధులు విధించింది లేదన్న కఠోర వాస్తవం ప్రజలకు తెలియదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన గత అర్థిక సంవత్సర వార్షిక బ‌డ్జెట్‌లో కేటాయింపులు, నిధులు విడుదల చేసిన మొత్తంపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం ప్రజలను ఇలా మోసం చేస్తోందని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.

గత బడ్జెట్లో పెట్టిన కొన్ని ప‌థ‌కాల‌కు ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుద‌ల చేయ‌లేద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారని ఆయన అన్నారు. మ‌రికొన్నింటికేమో భారీగా కేటాయింపులు చేసినట్లు చూపించిన ప్ర‌భుత్వం అతి కొద్ది మొత్తంలో మాత్ర‌మే నిధులు ఇచ్చింద‌ని చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నా పథకం ద్వారా నిధులు విదిల్చలేద‌ని, 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛ‌న్లు, అలాగే, గొర్రెల పంపిణీ, సమగ్ర భూసర్వే వంటి పలు ప‌థ‌కాల‌ను పెండింగ్ జాబితాలో పెట్టేసింద‌న్న విషయాలు పత్రికా క‌థ‌నంలో పేర్కొన్నిందని అన్నారు.

ఇక ఇదేవిధంగా గ‌తంలోనూ ప్రకటించిన అనేక పథకాలకు కాగితాలపై కేటాయింపులు బారెడుచూపి.. వాస్తవంలో మాత్రం రూపాయి విధిల్చలేదని అరోపించారు. ఈ పథకంలో ముందుగా నిలిచేది నిరుద్యోగ భృతి పథమేనని అన్నారు. ఈ పథకం కోసం రూ.5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి, వాటిని ఇవ్వ‌కుండా జాప్యంచేశారని విమర్శించారు. అందుకుగాను ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప‌థ‌కాల ప‌రిశీల‌న పేరిట అధికారుల‌కు ప‌నులు అప్ప‌జెప్పి చేతులు దులుపుకుందని చెప్పారు. 2021–22 బడ్జెట్లో నిరుద్యోగ భృతి మాటే లేకుండా చేసింద‌ని పత్రికా క‌థ‌నంలో పేర్కొందని తెలిపారు.

వీటిని రేవంత్ రెడ్డి ప్ర‌స్తావిస్తూ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్, ఆయన పార్టీ ఏ విధంగా మోసగిస్తుందో ఈ పత్రికా కథనం చేస్తే అర్థమవుతోందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టే బడ్జెట్ పద్దుల కోసం ప్రజలు ఆత్రుతగా వేచిచూస్తారని, కానీ ప్రభుత్వానికి మాత్రం వాటిని ప్రజలను మోసం చేసే చిట్టాపద్దు జాబితాగా లెక్కగడుతోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో  ''బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు.. విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తోన్న తీరు.  బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్ దే'' అని ట్వీట్ చేశారు. కాగా, ఈ నెలాఖ‌రున తెలంగాణ బ‌డ్జెట్ వేశ‌పెట్ట‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles