BJP leaders will be behind bars in next few days: Sanjay Raut అరడజను మంది బీజేపి నేతలు త్వరలో జైలుకు: సంజయ్ రౌత్

Sena threatens to expose bjp in press conference tomorrow jail its leaders

mumbai, mumbai news, maharashtra, sanjay raut,. shiv sena, bjp, anil deshmukh, kirit somaiya, uddhav thackeray, Sanjay Raut, BJP News, Indian Politics, Maharashtra

The Shiv Sena on Monday lashed out against its former ally BJP saying the party will “expose” its leaders at a press conference to be held at the Sena headquarters in Mumbai on Tuesday, while also threatening to put BJP leaders behind bars.

బీజేపి నేతల బంఢారాన్ని భయటపెడతాం.. జైలుకు పంపుతాం: సంజయ్ రౌత్ సంచలన ప్రకటన

Posted: 02/14/2022 08:58 PM IST
Sena threatens to expose bjp in press conference tomorrow jail its leaders

బీజేపీకి చెందిన అరడజను మంది నాయకులు మరి కొద్ది రోజుల్లో కటకటాల్లోకి వెళ్తారని శివసేన అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు సంజయ్‌ రౌత్‌ అన్నారు. అయితే ఎవరెవరు జైలు ఊచలు లెక్కబెడెతారన్న విషయమై వివరాలు కూడా వెల్లడిస్తానని అన్నారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ నేతల పేర్లు వెల్లడిస్తానన్నారు. గతేడాది నవంబర్‌లో మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ త్వరలో జైలు నుంచి బయటకు వస్తారన్నారు.

ఇటీవల ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలోని కొంత మంది నేతలపై ప్రతిపక్ష బీజేపీ అవినీతి ఆరోపణలు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించొద్దన్నారు. తాము భయపడబోమన్నారు. శివసేన, థాకరే కుటుంబంపై చేసిన తప్పుడు ఆరోపణలకు, కేంద్ర సంస్థల ‘దాదాగిరి’.. అన్నింటికి సమాధానాలు చెబుతామని సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు. మంగళవారం నాటి విలేకరుల సమావేశాన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే నిశితంగా పరిశీలిస్తారని చెప్పారు.

తన సమావేశాన్ని బీజేపీ, కేంద్ర సంస్థల చీఫ్‌లు తప్పనిసరిగా చూడాలని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ‘మహారాష్ట్ర అంటే ఏంటో రేపు వారికి తెలిసి వస్తుందని.. శివసేన అంటే మహారాష్ట్ర.. శివసేన మహారాష్ట్రలో 11కోట్ల మంది ప్రజల గొంతుక’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పరువు తీశారని, అయినా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఇప్పటికీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేయాలని కొంత మంది తనను ఇటీవల సంప్రదించారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles