Govt bans 54 Chinese apps over security threat concerns దేశభద్రతకు ముప్పు పోంచివున్న 54 చైనా యాప్ లపై నిషేధం

Govt bans 54 chinese apps that pose threat to india s security say sources

Chinese apps, Govt to ban 54 Chinese apps, India, Chinese app banned in India, PUBG Mobile, TikTok, Weibo, WeChat, AliExpress

The 54 Chinese apps include Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera - Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite

దేశభద్రతకు ముప్పు పోంచివున్న 54 చైనా యాప్ లపై నిషేధం

Posted: 02/14/2022 01:03 PM IST
Govt bans 54 chinese apps that pose threat to india s security say sources

డ్రాగన్ దేశానికి భారత్ మరోమారు గట్టి షాక్ ఇచ్చింది. ఈ మధ్య వరుసపెట్టి షాకిస్తున్న భారత్ దెబ్బకు చైనా విలవిలలాడుతోంది. గత ఏడాది పలు చైనా యాప్ లపై నిషేధాన్ని విధించిన భారత్.. అవి కొత్త రూపంతో మళ్లి అడుగుపెట్టిన వేళ.. వాటితో పాటు మరిన్ని కలుపుకుని మొత్తంగా 54 యాప్ లపై నిషేధాన్ని విధించింది. దీంతో చైనాకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. దేశ భ‌ద్ర‌తకు స‌మ‌స్యగా మారిన ఈ 54 చైనా యాప్‌ల‌ను నిషేధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా అదేశాలను జారీ చేసింది.

నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిట‌ర్‌, టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్‌, డ్యుయ‌ల్ స్పేస్ లైట్ యాప్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేలా ఆ యాప్‌లు ఉండ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేష‌న్ల‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. వాటిల్లో పాపుల‌ర్ యాప్‌లైన టిక్‌, వీచాట్, హ‌లో కూడా ఉన్నాయి. జాతీయ భ‌ద్ర‌త‌కు, సార్వ‌భౌమాధికారినికి ముప్పు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ 54 యాప్ లు చాలా ముఖ్యమైన డేటాకు అనుమతులు అడుగుతూ సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఆ యాప్‌లు రియ‌ల్ టైమ్ డేటాను తీసుకుంటున్నాయని ఆ స‌మాచారాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పాయి. 2020 మేలో చైనాతో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ మొద‌లైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 300 యాప్‌ల‌ను నిషేధించారు. గాల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత ఆ ఏడాది జూన్‌లో తొలిసారి చైనీస్ యాప్‌ల‌ను బ్యాన్ చేశారు. చైనా యాప్ ల విషయంలో భారత్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ నిషేధాలు విదిస్తుండటంతో చైనాకు దిమ్మదిరిగే షాక్ తగులుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles