మనుషులకు భయాలు ఉండడం సహజం. కొందరు చిన్నచిన్న విషయాలకు కూడా జంకుతుంటారు. కొందరికి ఎత్తైన ప్రాంతాలంటే భయం, మరికొందరికి పాములు, కుక్కలు, బొద్దింకలు అంటే భయం. భయపడే ప్రాణాలు కళ్ల ముందు కనబడితే వాటి నుంచి ఆమడ దూరం పారిపోతుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఓ మహిళ ఉడుమును (మానిటర్ లిజర్డ్) విపరీతంగా భయడింది. ఈ ఘటన థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నారాతివాత్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మహిళ కూర్చీలో కూర్చొని ఉండగా బయట నుంచి అక్కడికి ఓ ఉడుము వచ్చి చేరుతుంది. తోకను ఊపుతూ, నాలుకను బయటకు చూపుతూ భయపెట్టింది. దీంతో మహిళ కెవ్వుమని కేకలు వేస్తూ కూర్చీ మీద నిల్చుంటుంది. అంతేగాక చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇంతో షాప్‌లోని ఓ యువకుడు ఆ ఉడుమును పట్టుకునేందుకు పయత్నించినప్పటికీ వీలుపడలేదు. అయినా అది లొంగకుండా అతనిపై ఎదరుదాడికి ప్రయత్నించింది.
మహిళను ఏడుపుని చూడలేక ఇంతలో ఆ యువకుడు ఓ పొడవైన కర్రను తెచ్చి ఉడుము తల మీద బలంగా నొక్కి పెట్టాడు. అలా దానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే ఏడుస్తున్న మహిళ కళ్లు తుడుచుకుంటూ కూర్చీ దిగి నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్‌లో ఫిబ్రవరి 9న పోస్టు చేశారు. 56 సెకన్ల నిడివితో కూడిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ ప్రవర్తనపై నవ్వులు చిందిస్తున్నారు. ఉడుమును చూడగానే అమె వ్యవహరించిన ప్రవర్తన అమెనే నవ్వించేలా చేసింది.
అంతకుముందే రెస్టారెంట్లోకి వచ్చి నిల్చున్న ఇద్దరు మహిళలు దూరం నుంచి ఈ తతంగాన్ని మొత్తం చూశారు. ఉడుమును పట్టుకున్న తరువాత బాధిత మహిళ వారిని చూసి వాళ్లు నన్ను చూసి నవ్వేస్తున్నారు.. అంటూ నవ్వును అపుకోలేకపోయింది. ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో భలే సండది చేస్తు నెటిజనులను కూడా నవ్విస్తోంది. ఇక మరికొందరు నెటిజనులు మాత్రం ‘ఉడుమును చూసి మహిళ బయపడటం కాదు.. పాపం ఉడుమే మహిళను చూసి భయపడి ఉంటుంది.’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more