India headed for steep fuel price hike in March, Deloitte says భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు: డెలాయిట్ ఇండియా

India headed for steep fuel price hike after state polls end next month deloitte says

steep hike in fuel prices, steep hike in petrol price, steep hike in diesel price, steep hike in LPG Gas Prices, Steep hike in CNG prices, Steep hike in Edible oil prices, petrol retail price, petrol price hike, petrol price, fuel price, diesel price, Assembly Elections 2022, Uttar Pradesh Assembly Elections, Uttarakhand Assembly Elections, Goa Assembly Elections, Manipur Assembly Elections, Punjab Assembly Eletcions, Samajwadi Party, BJP, Congress, Shiromani Akalidal party, AAP, RLD, BSP, National Politics

Deloitte Touche Tohmatsu India expects the nation’s biggest fuel retailers to sharply raise pump prices after state elections end next month, adding pressure on the government and the central bank to take steps to contain inflation. “Because of the state elections, they haven’t increased the retail prices,” Debasish Mishra, partner at Deloitte, said.

భారీగా పెరగనున్న ఇంధన ధరలు.. లీటరుపై రూ.9 పెరిగే అవకాశం: డెలాయిట్ ఇండియా

Posted: 02/10/2022 02:20 PM IST
India headed for steep fuel price hike after state polls end next month deloitte says

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అందులోనూ యావత్ దేశం దృష్టితో పాటు ప్రపంచాన్ని రాజకీయ పర్యవేక్షకులను అత్యంతగా ఆకర్షిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ రోజున లేదా.. ఆ తరువాత వాహనదారులకు పెద్దస్థాయిలో షాక్ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్దమైందని ఇప్పటికే ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో తుది విడత ఎన్నికల పోలింగ్ కి ఒక్క రోజు ముందు లేదా.. అదే రోజున దేశంలో భారీస్థాయిలో ఇంధన ధరలను పెంచే అవకాశాలు వున్నాయిన్న వార్తలు వాహనదారుల్లో వణుకుపుట్టిస్తోంది.

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెరగడం ఖాయమని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్‌పీ (డెలాయిట్ టచీ తోమత్సు ఇండియా) తెలిపింది. అప్పటి వరకు ధరల పెరుగుదల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ సంస్థ పార్ట్‌నర్ దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు చమురు, గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా చమరు ధరల్లో జరిగే హెచ్చుతగ్గులకు అనుగుణంగానే దేశీయంగా ఈ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి.

అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపును ఈ సంస్థలన్నీ పక్కనపెట్టేశాయి. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందన్న కారణంతో ప్రభుత్వ ఆదేశాలతో ఈ సంస్థలన్నీ ధరల పెంపును తాత్కాలికంగా పక్కనపెట్టాయి. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వం చమురు ధరలను ముట్టుకోదని మిశ్రా అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మార్చి 10వ తేదీ తర్వాత లీటరుపై 8 నుంచి 9 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా పన్ను రూపంలో ప్రభుత్వం ఎంతో కొంత తగ్గిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, పన్ను మినహాయింపు పోగా మిగిలిన భారాన్ని మాత్రం వాహనదారులే భరించాల్సి వుంటుందని అన్నారు. పెట్రో ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయని అన్నారు. నిత్యావసర సరుకులతో పాటు ఇంధన ధరల ప్రభావం అన్నింటిపైనా పడుతుందని.. మరీముఖ్యంగా రవాణరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మిశ్రా అన్నారు. అంతర్జాతీయంగా కనుక బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటును అదుపు చేయడం భారత్‌కు సవాలే అవుతుందని పేర్కొన్నారు. అలాగే, చమురు ధరలు 10 డాలర్లు పెరిగితే దేశ వృద్ధిలో 0.3 నుంచి 0.35 శాతం మేర కోత పడుతుందని మిశ్రా వివరించారు.

ఇప్పటికే 70 సంవత్సరాల్లో లేని విధంగా ఇంధన ధరలు.. సెంచరీ మార్కును దాటి ఏకంగా లీటరు రూ.108కు చేరుకుంది. అయితే ఈ ధరల ఐదు రాష్ట్రాల ఎన్నికత తరువాత మరింతగా పెరగనుందన్న వార్త వాహనదారుల్లో అందోళన పుట్టిస్తోంది. ఇక దీంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయాల ధరలు కూడా పోటీపడి కేజీకి ఏకంగా వంద మార్కును దాటుతున్నాయి. ఈ తరుణంలో మరోమారు ఇంధన ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తరువాత పెంచనున్నారన్న వార్తలతో ప్రజలు కూడా అందోళన చెందుతున్నారు. ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా అకాశానంటుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles