Congress tunes Srivalli song from Pushpa for UP election యూపీ ఎన్నికల ప్రచారంలో పుష్ప పాట.. విడుదల చేసిన కాంగ్రెస్

Tu hai gazab up congress launches song to tune of srivalli from pushpa film for up election

tu hai gazab up, congress, up polls, up election, up type, pusha, srivalli, Uttar Pradesh Assembly polls, Priyanka Gandhi, Uttar pradesh, politics

The Congress party released its election song for the upcoming Uttar Pradesh Assembly polls on Friday. The poll anthem, set to the tune of popular song Srivalli from the Telugu film Pushpa, has as its refrain, 'Tu hai gazab, UP; Teri kasam, UP' (You are fantastic, UP; I swear, UP).

యూపీ ఎన్నికల ప్రచారంలో పుష్ప పాట.. విడుదల చేసిన కాంగ్రెస్

Posted: 02/05/2022 06:44 PM IST
Tu hai gazab up congress launches song to tune of srivalli from pushpa film for up election

దాదాపుగా మూడు దశాబ్దాల కాలం నుంచి తన ఉనికిని కోల్పోయిన తరుణంలో.. హిట్ బాట పట్టిన పుష్ఫ చిత్రంలోని శ్రీవల్లి పాటతో ప్రచారాన్ని కల్పించడంతో.. తాము సక్సెస్ మార్గంలో పయనించేందుకు దోహదపడుతుందని భావించిందో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే సూత్రాన్ని ఇప్పడు ఫాలో అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే బరిలోకి దిగుతున్న కాంగ్రెస్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని పాటను తమ ఎన్నికల ప్రచారంలో భాగం చేసింది.

ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తూంగా, ఆ సినిమాలోని పాటలు అందరి నోళ్లపై అడేస్తున్నాయి. ఇక క్రికెటర్ల నుంచి ప్రముఖల వరకు అందరూ వాటిని అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ పాటతోనే తాము కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని అనుకుని కాంగ్రెస్ దానిని సద్వినియోగం చేసుకుంది. కొత్తగా అలోచించి.. రాసిన పాట ఉత్తర్ ప్రదేశ్ వాసులను కూడా బాగా ఆకర్షిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ఓ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటలోని ట్యూన్‌ను పుష్ప సినిమాలోని ‘చూపే బంగారామాయేనే శ్రీవల్లి..’ సాంగ్‌ నుంచి తీసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు.  ‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ (చాలా అందంగా ఉంటావు యూపీ..) అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఈ పాటను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన యూపీ కాంగ్రెస్.. యూపీ వాసులమైనందుకు గర్వంగా ఉంది’ అన్న క్యాప్షన్ జోడించింది. యూపీలో ఈ నెల 10న తొలి విడతల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 410 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles