Maha Govt Allows Sale Of Wine In Supermarkets మహారాష్ట్రలో ఇక సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో ‘వైన్’

Maharashtra government allows sale of wine through supermarkets and shops

maharashtra wine sales, wine, Maharashtra, wine, liquor sale, supermarkets, wine manufacturing, Shiv Sena, NCP, Congress, BJP, Politics

Maharashtra cabinet approved the decision of allowing supermarkets and shops to sell wine directly to the consumers. In view of boosting the wine industry and supporting grapes growing farmers, the Maharashtra cabinet approved the decision of allowing supermarkets and shops to sell wine.

మహారాష్ట్రలో ఇక సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో ‘వైన్’

Posted: 01/28/2022 11:23 AM IST
Maharashtra government allows sale of wine through supermarkets and shops

మహారాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. మద్యం కోసం ఇక మహారాష్ట్రవాసులు మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై మహారాష్ట్రలో మద్యం సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న 1,000 చదరపు అడుగులు లేదంటే, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్‌లు, దుకాణాలు షెల్ఫ్-ఇన్-షాప్ పద్ధతిని అవలంబించవచ్చు.

అయితే, ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలకు సమీపంలోని సూపర్ మార్కెట్లకు మాత్రం ఇందుకు అనుమతి లేదు. మద్య నిషేధం అమల్లో ఉన్న జిల్లాల్లోనూ దీనికి అనుమతి లేదు. వైన్ అమ్మకాల కోసం లైసెన్స్ ఫీజు కింద సూపర్ మార్కెట్లు రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది.

మహారాష్ట్రను మద్య రాష్ట్రంగా మార్చడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మహారాష్ట్ర బీజేపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందని దుమ్మెత్తి పోసింది. ‘మద్య రాష్ట్రం’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని బీజేపి సంపూర్ణంగా అడ్డుకుంటామన్నారు. కాగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ బీజేపి నేతల విమర్శలను తనదైన శైలిలో తిప్పికోట్టారు. రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లలో కేవలం వైన్ మాత్రమే విక్రయిస్తున్నారని, మద్యం కాదని ఈ విషయాన్ని తెలుసుకున్న తరువాత కూడా బీజేపి.. కావాలని ప్రభుత్వంపై విమర్వలు చేస్తోందని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles