'Irrational freebies' by political parties irk Supreme Court ఉచిత వాగ్ధానాలపై.. కేంద్రం, ఈసీకి ‘సుప్రీం’ నోటీసులు

Freebie budget going beyond regular budget supreme court airs concern

Supreme Court, SC notice to Centre on freebies, freebies by political parties, political promises, promises for vote, Supreme Court notice to Election Commission, Freebies, election freebies, elections promises, Supreme Court on freebies, Election Commission (EC), Election Manifesto, politcial parties, Politics

The Supreme Court issued notice to the Centre and the Election Commission regarding guidelines on "freebies" promised by political parties before elections. Calling it a "serious issue", the court said that the "freebie budget" is going beyond the regular budget. It has sought a response from the poll body and the union government in four weeks.

ఎన్నికల ఉచిత వాగ్ధానాలపై.. కేంద్రం, ఎన్నికల సంఘానికి ‘సుప్రీం’ నోటీసులు

Posted: 01/25/2022 03:56 PM IST
Freebie budget going beyond regular budget supreme court airs concern

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ప్రజలకు హామీలను ఇవ్వడం, పలు వాగ్దానాలు చేయడం పరిపాటే. అయితే ఈ సమయంలో ఫలానా ఉచితం అంటూ చేసే వాగ్ధానాలు ఇవ్వడం అత్యంత తీవ్రమైన సమస్యగా దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప‌లానా ఉచితంగా అందిస్తామంటూ కూడా కొన్ని పార్టీలు త‌మ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చేర్చడం రాజ్యంగ విరుద్దమని, ఉచిత హామీలను ఇచ్చే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పేర్కోంటూ సుప్రీంకోర్టు న్యాయవాది అవ్వినీ ఉపాధ్యయ దాఖలు చేసిన పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎ,ఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

ఈ పిటీషన్ ను విచారిస్తున్న సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం ఇవాళ సీరియ‌స్ అయ్యింది. సాధారణ బడ్జెట్ తో పోలిస్తే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీల బడ్జెట్టే ఎక్కువైపోతోందని అసహనం వ్యక్తం చేసింది. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం, ఎన్నిక‌ల సంఘానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీలు ప్ర‌క‌టించే ఉచిత వాగ్ధానాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల‌ని త‌మ నోటీసుల్లో సుప్రీం పేర్కొన్న‌ది. రెగ్యులర్ బ‌డ్జెట్ క‌న్నా.. ఉచిత బ‌డ్జెట్ హ‌ద్దులు దాటుతోంద‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అసహనం వ్యక్తం చేశారు. తాము జారీ చేసిన నోటీసులపై నాలుగు వారాల్లోగా అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. ఉచిత హామీల వల్ల ఎన్నికలు ప్రభావితమవడమే కాకుండా, ఎన్నికల్లో పారదర్శకత కూడా లోపిస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు.

ఉచిత వాగ్ధానాల అంశంపై గైడ్‌లైన్స్‌ను రూపొందించాల‌ని ఇప్ప‌టికే ఈసీని కోరిన‌ట్లు సీజే తెలిపారు. ‘‘ఇంతకుముందు ఇదే విషయానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చాం. దానిపై ఒకేఒక్కసారి ఈసీ సమావేశమైంది. రాజకీయ పార్టీల అభిప్రాయం అడిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో.. దాని ఫలితమేంటో కూడా నాకు తెలియదు’’ అని అన్నారు. ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడంపై 2013లోనే సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఉచిత వాగ్ధానాలు ఇచ్చి నేర‌వేర్చ‌ని పార్టీల గుర్తుల‌ను సీజ్ చేయాల‌ని, ఆ పార్టీల గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని పిల్‌లో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles