New Jersey baby spends nearly $2,000 shopping online బుడతడే కానీ అన్ లైన్ షాపింగ్ లో ఘనాపాటి..

Child s play indian american toddler spends big buys 2000 worth of walmart furniture

Pramod, walmart, Madhu Kumar, 22 months old child, new jersey, toddler, Indian-American toddler, online shopping, ayaansh kumar, walmart furniture, childs play

New Jersey residents Pramod and Madhu Kumar recently discovered that online shopping has indeed become as easy as a child’s play, after their 22-month-old toddler, Ayaansh, ordered furniture worth $2000 (Rs 1.4 lakhs) online from Walmart.

బుడతడే కానీ అన్ లైన్ షాపింగ్ లో ఘనాపాటి.. ఏకంగా లక్షన్నరకు ఎసరు..

Posted: 01/25/2022 01:22 PM IST
Child s play indian american toddler spends big buys 2000 worth of walmart furniture

చిన్నారులు ఒకప్పుడు బొమ్మలతో అడుకునేవారు. కానీ తరం మారిన కొద్దీ వారు మారుతూ అందివచ్చిన శాస్త్రసాంకేతిక విప్లవంతో.. రంగురంగులుగా కనిపిస్తూ.. ఫోన్ రింగ్ టోన్ లు అందంగా మ్రోగిస్తూ అకర్షిస్తుండటంతో వాటిలో ఏదో దాకుని వుందనుకుని.. సెల్ ఫోన్లకు ఎక్కువగా అకర్షితులవుతున్నారు. ఇలా తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ కు అకర్షితుడైన ఓ బుడతలు ప్రపంచంలో అనేకం. కానీ భారత సంతతికి చెందిన అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతానికి చెందిన 22 నెలల చిచ్చర పిడుగు స్మార్ట్ ఫోన్‌తో  చేసిన పని ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటుగా యావత్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదేంటి అంటారా... ఇంతకీ ఈ బుడతడు ఏం చేశాడని అంటారా..

భారత సంతతకి చెందిన అమెరికన్ దంపతులు ప్రమోద్‌ , మధుకుమార్‌లు న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారుంట ఇంటికి వరుసగా కొరియర్లు వచ్చి చేరుతున్నాయి. కొత్తగా తీసుకున్న ఇంటికి సంబంధించిన ఫర్నీచర్‌ వస్తువులు ఒక్కొక్కటిగా వాల్‌మార్ట్‌ బృందం ఇంటికి చేరవేస్తోంది. తాను ఆ వస్తువులు కొనాలని అనుకున్న మాట వాస్తమేనని, అయితే తాను ఆర్డర్‌ చేయలేదంటూ మధుకుమార్‌ డెలివరీ బాయ్స్‌తో వాదనకు దిగింది. అయితే వాల్‌మార్ట్‌ ప్రతినిధులు ఆర్డర్‌కి సంబంధించిన వివరాలను మధుకుమార్‌ ముందు ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యింది. ఎందుకంటే విలువైన వస్తువులు ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ చేసింది మరెవరో కాదు.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే ఇరవై నెలల బాబు ఆయాన్ష్‌. తల్లి ఫోన్‌లో వాల్‌మార్ట్‌ యాప్‌లో కార్ట్‌లో పిక్‌ చేసి ఉన్న వస్తువలను అతను సునాయాసంగా ప్లేస్‌ ఆర్డర్‌ చేసేశాడు.

ఇలా అమెరికన్‌ కరెన్సీలో 2000 డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో రూ. 1.49 లక్షలు) విలువైన వస్తువులు బుక్‌ చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయాన్ష్‌ ఎప్పుడు ఫోన్‌ పట్టుకునే ఉంటాడని, కానీ ఫేస్‌ రికగ్నేషన్‌, పాస్‌కోడ్‌ ఉన్న ఫోన్‌ను ఆయాన్ష్‌ ఎలా ఓపెన్‌ చేశాడన్నది మిస్టరీగా మారింది. వెంటనే ఆయన్ష్‌ చేతికి కొన్ని ఫోన్లు ఇవ్వగా ఈ మెయిల్స్‌ పంపడం, కాంటాక్ట్‌ లిస్ట్‌ చెక్‌ చేయడం, క్యాలెండర్‌ క్లోజ్‌ చేయవం వంటి పనులు పక్కా చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా అమెరికా మీడియాలో బాగా పాపులర్‌ అయ్యింది. దీంతో 20 నెలల చిచ్చర పిడుగు ఆయాన్ష్‌ ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్‌ సిసింద్రీగా మారాడు. పొరపాటున ఆర్డర్‌ చేసినట్టుగా తెలపడంతో.. సదరు ఫర్నీచర్‌ని వెనక్కి తీసుకునేందుకు వాల్‌మార్ట్‌ అంగీకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles