It was 'chacha's pat on cheek': BJP MLA బీజేపి ఎమ్మెల్యేకు పరాభవం: నిండు సభలో చెంపపై కోట్టిన రైతు..

Viral video in up a bjp mla a slap and then a clarification

BJP MLA Pankaj Gupta, pankaj gupta, bjp mla, bjp mla slapped, bjp mla slapped by farmer, viral video bjp mla slapped, BJP MLA Slap Video, clarification, farmer video, Farmer Leader, Unnao, Yogi Adityanath, PM Modi, Uttar Pradesh, viral video

A viral video from Uttar Pradesh has given fresh fodder to the opposition ahead of the state elections to attack the Yogi Adityanath government. As the video was being widely shared, a prompt reaction came from the BJP MLA Pankaj Gupta who was seen in the clip, purportedly being slapped by a farmer. "It was just a pat on the cheek," he told reporters.

ITEMVIDEOS: బీజేపి ఎమ్మెల్యేకు పరాభవం: నిండు సభలో చెంపపై కోట్టిన రైతు..

Posted: 01/08/2022 07:25 PM IST
Viral video in up a bjp mla a slap and then a clarification

ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన రోజునే ఉత్తర్ ప్రదేశ్ లోని బీజేపి ఎమ్మెల్యే పంకజ్ గుప్తాకు ఎదురైన పరాభవం వెలుగోలోకి వచ్చింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. తాజాగా ఎమ్మెల్యే తరపున వకాల్తా పుచ్చుకుని సంజాయిషీ ఇచ్చిన రైతు వీడియోను వైరల్ చేయడంతో అది కాస్తా జాతీయ మీడియాకు చిక్కింది. దీంతో ఇది వివరణ అయితే అసలు జరిగిందేమిటని.. ఆ వీడియోను కూడా సేకరించడంతో.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఎన్నికలు షెడ్యూలు విడుదలైన వేళ ఉ్తతర్ ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

అసలే ఎన్నికల వేడితో శీతాకాలంలోనూ చమటలు పడుతున్న నేపథ్యంలో ఈ ఉన్నావ్ బీజేపి ఎమ్మెల్యే సదర్ పంకజ్ గుప్తాకు చెందిన వీడియో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా అధికార బీజేపి పక్షాన్ని సంకట పరిస్థితుల్లోకి నెట్టింది. దీంతో సుదీర్ఘ మంతనాలు జరిపారో.. లేక ఏం భరోసా ఇచ్చారో తెలియదు కానీ ఏకంగా ఎమ్మెల్యేను నిండు సభలో పరాభవానికి గురిచేసిన రైతు నేతను ఎలా ఒప్పించారో మరి.. ఆయనను తమ పార్టీ వ్యక్తిగా.. తనకు బాబాయ్ వరుస అవుతాడని, ఆయన ప్రేమతో తనను దీవించడానికే ఇలా చేశాడని పేర్కోన్నారు. ఈ క్రమంలోనే ఓ ఘటన ఇప్పుడు యూపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది రాష్ట్రంలోని యోగా సర్కార్ పై దాడిగా ప్రతిపక్షాలు పేర్కోంటున్నాయి.

అసలు ఏం జరిగిందంటే.. ఉన్నావ్ బీజేపి ఎమ్మెల్యే సదర్ పంకజ్‌ గుప్తా మూడు రోజుల కిందట ఓ విగ్రహా విష్కరణ కార్యక్రమానికి హాజరై బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఓ రైతు నాయకుడు ఛత్రపాల్ వేదికపైకి వచ్చి అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు. అది కూడా తాను మార్చిచెబుతున్నట్లు కాకుండా గట్టిగానే కొట్టాడు. ఈ హఠాత్‌ పరిణామంతో కాసేపు అందరూ నివ్వెరపోయారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ రైతునేతను వేదికపై నుంచి కిందికి తీసుకెళ్లారు. ఈలోగా పరుపు పోయిందని భావిస్తూనే ఎన్నికల వేళ.. దిద్దుబాటు చర్యలకు వెనువెంటనే పూనుకున్నారు ఎమ్మెల్యే.

‘‘ఆయనను ఎందుకలా తీసుకెళ్తున్నారు..? ఆయన మా బాబాయి.. ప్రేమతోనే తట్టారు’’ అని సర్ధిచెప్పుకున్నారు. అయితే ఈ మాటలను వెనక నుంచి ఎవరో ఎమ్మెల్యేకు చెప్పడం కూడా వీడియో క్లిపులో స్పష్టంగా వినబడుతోంది. అయితే రాజకీయాలు.. అందులోనూ ఎన్నికలు కాబట్టి తప్పదన్నట్లు దిద్దుబటుకు వెంటనే దిగారు. ఏదీ ఏమైనా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించడంతో కూడాని 21 నిడివి గల వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఇక తాను ముందునుంచి చెబుతున్నట్లు ఆయన తన తండ్రి సమానుడని, ప్రేమపూర్వకంగానే తనను ఛత్రపాల్ అనే బాబాయ్ తనను చెంపపై తట్టారని ఎమ్మెల్యే పంకజ్‌ గుప్తా, మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు.

రైతు నేత ఛత్రపాల్ తాను ఎమ్మెల్యేను అభిమానంతోనే కొట్టానని సమర్థించుకున్నాడు. ఇక దీనిపై ఎమ్మెల్యే పంకజ్ గుప్తా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే తన పరువు మర్యాదలను మంటగలిపి గెలవాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ‘కావాలనే ఎడిట్ చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి చక్కర్లు కొట్టిస్తున్నాయి’ అని వెల్లడించారు.  మరోవైపు, ఈ ఘటనపై సమాజ్‌వాది పార్టీ స్పందిస్తూ.. ఈ చెంపదెబ్బ ఎమ్మెల్యేని కొట్టినట్టు కాదని.. నిరంకుశ పాలనను అందిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కొట్టినట్లని విమర్శించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles