3 JeM terrorists killed in overnight encounter in J-K జమ్మూలోని బుద్గాంలో ఎన్‌కౌంటర్‌.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం..

3 jem terrorists killed in overnight encounter in j k s budgam j k police

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, budgam encounter, Pulwama encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, Budgam encounter JK, Jammy encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Shopian, Jammu and Kashmir, National politics

Three Jaish-e-Mohammad (JeM) terrorists were killed in an overnight encounter with security forces in Budgam district of Jammu and Kashmir, police said on Friday. The encounter broke out in Budgam's Zolwa village late on Thursday, a police official said. Three terrorists were killed in the exchange of fire with the security forces, the official said.

జమ్మూలోని బుద్గాంలో ఎన్‌కౌంటర్‌.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం..

Posted: 01/07/2022 11:47 AM IST
3 jem terrorists killed in overnight encounter in j k s budgam j k police

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాష్ట్రంలోని బుద్గాం జిల్లాలోని ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లాలోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపగా.. ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

కాగా ఈ ఎన్ కౌంటర్ తో హతమైన ఉగ్రవాదులు జైష్-ఈ- మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా బధ్రతాదళాలు గుర్తించాయి. బుద్గాం జిల్లాలోని జోల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనన్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. భద్రతా దళాలతో కలసి జోల్వా గ్రామాన్ని ముట్టడించారు. ఆ గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలపైకి ముష్కరులు కాల్పులు జరిపడం ప్రారంభించారు. దీంతో హుటాహుటిన స్పందించిన గాలింపు దళాలు కూడా ప్రతిదాడులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గరు ఉగ్రవాదులు మరణించారు. అయితే స్థానికంగా ఉద్రగవాదుల కోసం భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు జరుపుతున్నాయి.

బుద్గం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటరల్లో ప్రాంతం నుంచి మూడు ఎకే 56 తుపాకులు, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ ఇనిస్పెక్టర్ జనరల్ అఫ్ పోలీసు విజయ్ కుమార్ తెలిపారు. ఇక మరణించిన ముగ్గురిలో ఇక ఉగ్రవాదిని మాత్రం శ్రీనగర్ ప్రాంతానికి చెందిన వసీమ్ గా గుర్తించామని, మరో ఇద్దరిని గుర్తించే పనిలో వున్నామని తెలిపారు. ఇక పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles