CPI Narayana slams move to hike GST on footwear జీఎస్టీ పెంపుపై సీపిఐ నారాయణ వినూత్న నిరసన

Gst council decides to defer hike on textiles from 5 to 12 says nirmala sitharaman

CPI national secretary K Narayana, GST on footwear, GST, GST Council Meeting, gst council meeting, congress, gst council meeting, goods and services tax, Nirmala Sitharaman, FM Nirmala Sitharaman, interest,Textiles, textile industry footwear industry, GST rate on footwear, GST Council, Finance Minister, Nirmala Sitharaman, textile rate, covid medicines, GST rates, Footware, Transport, Auto Travel, National Politics

CPI national secretary K Narayana criticised the Centre for proposing to increase goods and services tax (GST) from 5 per cent to 12 per cent on footwear which are essential for everyone, including common people. He described the move as 'shameless' on the part of the BJP government at the Centre. He said with the increase of GST on footwear, common people have to keep his sandals on head and carry them instead wearing.

చెప్పులు కుట్టి, పాలిష్ చేసి.. జీఎస్టీ పెంపుపై సీపిఐ నారాయణ వినూత్న నిరసన

Posted: 01/04/2022 01:42 PM IST
Gst council decides to defer hike on textiles from 5 to 12 says nirmala sitharaman

చెప్పుల‌పై వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలుకు నోచుకోనున్న తరుణంలో ఆయన డిసెంబర్ నుంచే తన వ్యతికేతను ప్రదర్శించారు. అంతటితో ఆగని ఆయన ఇక నుంచి పేదలు కాళ్లకు చెప్పులు వేసుకునేందుకు బదులు తలపై పెట్టుకునేలా కేంద్రం నిర్ణయం ఉందని ఆయన వ్యంగోక్తులు విసిరారు. అంతటితో ఆగని ఆయన ఈ మేరకు మీడియా సమావేశంలో తన తలపై చెప్పులు పెట్టుకుని కూడా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఇదే అంశంపై తన వ్యతిరేకతను మరోలా ప్రదర్శించారాయన. తానే స్వయంగా చెప్పులు కుట్టి, వాటికి పాలిష్ చేసి తన నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చెప్పులు కుట్టి, పాలిష్ చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోని ప్రభుత్వాలన్నీ పేదరిక వ్యతిరేకంగా పనిచేస్తే.. ప్రధాని మోడీ ప్రభుత్వం మాత్రం పేదవాడికి వత్యిరేకంగా పనిచేస్తోందని అరోపించారు. మాటల్లో పేదవాడిని గెలిపించి.. చేతల్లో అణచివేస్తూ.. పెద్దవాళ్ల (కార్పొరేట్ల) కనుసన్నళ్లో పనిచేస్తోందని నారాయణ విమర్శించారు.

తాజాగా పేదవాడికి నిత్యావసర వస్తువుగా మారిన చెప్పులను కూడా కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని దుమ్మెత్తి పోశారు. సామాన్యుడి కష్టం తనకు తెలుసు కాబట్టే నెత్తిన చెప్పులు పెట్టుకున్నానని అన్నారు. దీనికి బీజేపీ నేతలు మాత్రం స్థాయి దిగజారిపోయారని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఏపీలోని సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడుతూ.. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడానికి ప్రయత్నించడం శోచనీయమని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles