India Facing Omicron-Fuelled Third Wave? దేశంలో ధర్డ్ వేవ్ కు సంకేతాలు.. పెరుగుతున్న కరోనా కేసులు..

Omicron fuelled third covid wave to hit india soon

Coronavirus, Covid, Covid vaccine, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

The Omicron variant has officially arrived in India. Cases are rising in Delhi and Maharashtra, along with many other states. Dubbed to be a more infectious variant version than even Delta (albeit with a reported milder illness) the mutant has spurred an increase in cases across the Europe and US.

దేశంలో ధర్డ్ వేవ్ కు సంకేతాలు.. పెరుగుతున్న కరోనా కేసులు..

Posted: 12/30/2021 11:25 AM IST
Omicron fuelled third covid wave to hit india soon

దేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతుండటం మూడవ దశకు సంకేతమా.? అన్న అనుమానాలు సర్వత్రా వినబడుతున్నాయి. ఇక సౌతాఫ్రికా నుంచి ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ కేసులు కూడా గణనీయంగా పెరుగుతుండటం దేశప్రజలను కలవరానికి గురిచేస్తోంది. గత కొంతకాలంగా పది వేల లోపు కరోనాకేసులు నమోదవుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో అనూహ్యంగా పెరిగాయి. ఒక్క రోజులో ఏకంగా 13 వేల మార్కును దాటాయి.

మరోపక్క ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చిరించిన నేపథ్యంలో దేశంలోనూ ఈ కేసుల సంఖ్య వెయ్యి మార్కుకు చేరువలో వుంది. గత 24 గంటల వ్యవధిలో 961 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా దేశరాజధాని ఢిల్లీ సహా మహారాష్ట్రలలో నమోదయ్యాయి. ఆ తరువాత గుజరాత్ 97, రాజస్థాన్ 89. కేరళ 65, తెలంగాణ 62, తమిళనాడు 45, కర్ణాటక 34, ఆంధ్రప్రదేశ్ 16, హర్యానా 12, పశ్చిమ బెంగాల్ 11 కేసులు నమోదయ్యాయి. ఇక మరో 11 రాష్ట్రాల్లోనూ సింగిల్ డిజిట్ లో కేసులు నమోదయ్యాచి.

అయితే ఒమిక్రాన్ సోకిన 961 మందిలో ఇప్పటికే 320 మంది కోలుకున్నారు. గత కొన్నిరోజుల తరువాత 13,154 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అంతకుముందు రోజుకంటే 43 శాతం అధికంగా కొత్తగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 82,402 (0.24 శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. 7,486 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.48 కోట్ల మందికి కరోనా సోకగా.. రికవరీలు 3.42కోట్ల (98.38 శాతం)కు చేరాయి. 24 గంటల వ్యవధిలో 268 మంది మరణించారు. మొత్తంగా 4,80,860 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దేశవ్యాప్తంగా 143 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

ఇక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే తన రాష్ట్రంలో మూడవ దశ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. అయితే దానిని ఎదుర్కోనేందుకు అన్ని విధాలుగా రాష్ట్రం ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. వైద్యఆరోగ్యశాఖ ప్రజలను మూడవ దశ బారిన పడనీయకుండా తగు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో అసుపత్రి సౌకర్యాలు పెంచడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్యశాఖ శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని అన్నారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ.. ప్రజల అరోగ్యాలను పరిరక్షించుకునే బాధ్యతను చేపట్టామని అన్నారు.

ఇక ఫిబ్రవరి 3 తేదీ నాటికి దేశంలో కరోనా మూడవ దశ తీవ్ర స్థాయికి చేరుకుంటోందని ఐఐటీ కాన్పూర్ అద్యయనం స్పష్టం చేసింది. ఐఐటీలోని పరిశోధకులు ఈ మేరకు మోడలింగ్ అద్యనం చేసి ఫిబ్రవరి 3వ తేది నాటికి మూడవ దశ తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంచాన వేసినట్ల తెలిపారు. అయితే ఇదే విషయాన్ని జాతీయ కోవిడ్ సూపర్ మోడల్ కమిటీ కూడా తెలిపింది. మూడవ దశ కొత్త సంవత్సరం తొలినాళ్లలోనే ఏర్పడే ప్రమాదముందని అంచనా వేసింది. ఈ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ రావు ప్రకారం ఒమిక్రాన్ తో కూడిన మూడవ దశ కొత్త సంవత్సరం తొలినాళ్లల్లో ఏర్పడనుందని.. అయితే ఇది రెండో దశకన్నా తీవ్రంగా మాత్రం ఉండబోదని అంచనా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles