Leopard jumps the gate of a residence to nab a pet dog పది ఫీట్ల ఎతైన గేటును దూకిన చిరుత.. ఏం చేసిందంటే..

Leopard jumps the gate of a residence to nab a pet dog

pet dog video, leopard video, IFS video, Parveen Kaswan, CCTV footageanimal video, animal viral video, horrifying video, scary video, Twitter,Crime

This is the shocking moment a leopard carried away a family's pet dog after jumping over a gate. CCTV footage shared by Indian Forest Service officer Parveen Kaswan shows the leopard jumping over the locked gate and attacking the dog off-camera, before eventually making off with unfortunate canine.

పది ఫీట్ల ఎతైన గేటును దూకిన చిరుత.. ఏం చేసిందంటే..

Posted: 12/28/2021 07:26 PM IST
Leopard jumps the gate of a residence to nab a pet dog

అడవి ప్రాంతాలకు చేరువలో నిర్మాణాలు వస్తుండటంతో క్రూరమృగాలు జనారణ్యంలోకి ఆహారం వెతుకుంటూ వస్తున్నాయి. క్రూర మృగాలు తమకు ఆహారం తప్పక లభిస్తుందని తెలియడంతో దాడులకు వెనుకాడటం లేదు. అయితే అవి ఆహారం కోసం ఎంతటి సాహసాలకైనా తెగబడుతుంటాయి. ఎంతలా అంటే ఏకంగా పది ఫీట్ల ఎత్తులో వున్న గేటును కూడా దూకేసీ మరీ ఆహారాన్ని అందుకుని వెళ్తుంటాయి. అయితే ఆ ఆహారం ఏదో తినే పదార్థమే అయితే పర్వాలేదు.. కానీ అదే ఇంటి యజమానులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఓ జీవే అయితే.. ఎంతటి విషాదం.

ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి వీడియోలు సిసిటీవీ ఫూటేజీల్లో లభించడంతో దానిని నెట్టింట్లో షేర్ చేయడంతో ఈ భయానక దాడి వెలుగులోకి వచ్చింది. వేటాడేది ఒకటి.. పరుగెత్తేది ఇంకోకటి.. దోరికిందా.. ఇది చస్తాది.. దొరక్కపోతే అది చస్తాది.. ఒక జీవికి అకలి వేసిందా... ఉంకో జీవికి అయువు మూడిందే.. దాక్కో దాక్కో శునకం.. చిరుత వచ్చి కొరుకుద్ది పీక అన్నట్లుగా సాగిందీ భయానక ఘటన. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసిటీవీ ఫూటేజీలో రికార్డు కావడంతో దానిని ఇంటి యజమానులు ఇంటర్నెట్ లో షేర్ చేశారు. ఈ వీడియోను ఎవరో ఇండియన్ ఫారెస్ట్ అధికారి ప్రర్వీన్ కాశ్వాన్ కు వాట్సాప్ లో పంపించారు.

దీనిని వీక్షించిన ఆయన.. ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసి తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించకుండానే ఆయన కొండ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని ఆయన పేర్కోన్నారు. అయితే క్రూరమృగాల దాడి నుంచి పెంపుడు శునకాలను రక్షించుకోవాలంటే అందుకు ఓ చక్కటి సలహాను కూడా అందించారాయన. క్రూరమృగాల దాడి వీటిని నివారించాలంటే పెంపుడు జంతువుల మెడకు ఇనుప కాలర్ చుట్టాలని, ఇవి క్రూరమృగాల నుంచి వాటిని రక్షిస్తాయని అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆయన ఓ ఫోటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఇక ఆయన తన అకౌంట్ ద్వారా పంచుకున్న ఈ వీడియోలో నిషిధీ రాత్రిలో గ్రామంలోకి చోరబడిన ఓ చిరుత వెళ్తుండగా.. ఓ ఇంటి ముందు కాపాలాగా వున్న శునకం.. దానిని చూసి బిగ్గరగా అరిచింది. ఇంట్లోని తన యజమానులతో పాటు ఇరుగుపోరుగువారిని కూడా అప్రమత్తం చేసింది. అయితే అందరూ ఆదమరచి నిద్రపోతున్న కారణంగా ఎవరూ దాని అరుపులను పెద్దగా పట్టించుకోలదు. దీంతో చిరుత కూడా శునకం అరుపులతో అప్రమత్తమైంది. తనకు ఆహారం లభించిందని ఫిక్స్ అయ్యింది. వెంటనే పది ఫీట్ల ఎత్తుగా వున్న గేటను దూకేసి.. శునకాన్ని నోట కరుచుకుని గోడ దూకి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా లక్ష మందికి పైగా వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles