Telangana Discoms propose hike in power tariff విద్యుత్ వినియోదారులకు షాక్ ఇవ్వనున్న తెలంగాణ సర్కార్.!

Telangana discoms propose hike in power tariff

Telangana Power Distribution Companies, Aggregrate Revenue Requirement, TSERC, Telangana State Electricity Regulatory Commission, power tarrif hike, Discoms, domestic, commercial, ERC, ARR, Retail supply, CM KCR, TRS, Hyderabad latest news, Telangana, Politics

The proposal stated to hike power tariff by 50 paise per unit on domestic consumption and Rs 1 per unit for all the remaining sectors. The discoms submitted Aggregrate Revenue Requirement (ARR) and Retail Supply Tariff to the Telangana State Electricity Regulatory Commission (TSERC) for the fiscal 2022-23.

విద్యుత్ వినియోదారులకు షాక్ ఇవ్వనున్న తెలంగాణ సర్కార్.!

Posted: 12/27/2021 07:19 PM IST
Telangana discoms propose hike in power tariff

తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనుందా.? విద్యుత్ చార్జీలను పెంచబోమని.. తెలంగాణలో చీకట్లను పారద్రోలి విద్యుత్ కాంతులను నింపిన ప్రభుత్వం తమదని చెప్పుకుని మరో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. కరోనా కష్టకాలంతో పాటు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని మళ్లీ పునరుద్దరణ చేసేందుకు విద్యుత్ చార్జీలను పెంచనుంది. ఈ మేరకు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్‌ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది.

ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై., వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఈఆర్సీ (Electricity Regulatory Commission)కి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్‌లకు 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ క్రమంలో ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించింది. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా.. ఈ భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది.

ఎల్.టీ (డొమెస్టిక్)కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా...రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉంది. రైల్వే చార్జీలు,బొగ్గు,బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయిందని  టీఎస్ ఎస్పీడిఎసిఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power tarrif hike  Discoms  domestic  commercial  ERC  ARR  Retail supply  CM KCR  TRS  Telangana  Politics  

Other Articles