First Omicron death reported in Australia ఆస్ట్రేలియాలోనూ నమోదైన తొలి ఒమిక్రాన్ మరణం..

Australia records first omicron death authorities stick to reopening plan

coronavirus news, Omicron, omicron cases in Australia, Omicron Death, Omicron Case Tally, Omicron Variant Alerts, Omicron Death in Australia, Australia First Omicron Death, Omicron Case, Omicron Cases in Australia, 80 years old man, pre-existing health issues, New southwales, Epidolomist Christain Salve, Australia

Australia reported its first confirmed death from the new Omicron variant of COVID-19 amid its biggest daily surge in infections, but the authorities refrained from imposing new restrictions saying hospitalisation rates remained low. The death, a man in his 80s with underlying health conditions, marked a grim milestone for the country

ఆస్ట్రేలియాలోనూ నమోదైన తొలి ఒమిక్రాన్ మరణం..

Posted: 12/27/2021 01:39 PM IST
Australia records first omicron death authorities stick to reopening plan

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ ముప్పు పెరుగుతున్నది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప.. డెల్టా వేరియంట్ తో పోల్చితే దీని ప్రభావంత తక్కువేనని చెప్పిన వైద్య నిఫుణుల మాటలను వమ్ము చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వేరియంట్ కూడా ప్రాణాలను కబళించివేస్తోంది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ కూడా ప్రమాదకారి అన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ లో ఏకంగా 15 మందిని పోట్టన పెట్టుకున్న ఒమిక్రాన్.. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయిల్, జర్మనీలలోనూ తొలి మరణాలను నమోదు చేసుకుంది. ఇక తాజాగా ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్‌ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని ఆదేశ వైద్యవిభాగం అధికారులు ధ్రువీకరించారు.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తికి ఇటీవల ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకింది. అతడు సోమవారం కన్నుమూశాడు. వృద్ధుల సంరక్షణా కేంద్రంలో అతడికి ఈ వైరస్‌ సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకు మించిన వివరాలను వెల్లడించిందుకు అధికారులు నిరాకరించారు. ఇంతకీ ఆ వ్యక్తి కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నాడా.? లేదా.? అన్న వివరాలతో పాటు అతనికి అంతకుముందు ఏ విధమైన అనారోగ్య సమస్యలు వున్నాయన్న వివరాలను మాత్రం అక్కడి ప్రభతు్వం వెల్లడించలేదు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడి అస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ నగరానికి చెందిన 80 ఏళ్ల వృద్దుడు మరణించాడని అక్కడి ఎపిడమాలజిస్టు క్రిస్టియన్ సెల్వే చెబుతున్న వీడియోను అస్ట్రేలియా ప్రభుత్వం విడుదల చేసింది.

ఇదిలావుండగా, అస్ట్రేలియాలో ఇప్పటికే పలు మార్లు లాక్‌డౌన్లు విధించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్‌ పేషెంట్‌ మృతితో మళ్లీ కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోపక్క అక్కడ రోజువారీ కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో అస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్, విక్టోరియా, క్విన్స్ ల్యాండ్ రాష్ట్రాల్లో కలిపి నిన్న ఒక్కరోజునే ఏకంగా 9107 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో న్యూఇయర్ సందర్భంగా అధికారులు ఆంక్షలను అమలుచేస్తున్నారు. క్వీన్స్ ల్యాండ్ లో పర్యాటించాలనుకునే వారు పీసీఆర్ పరీక్షల రిపోర్టులను తప్పనిసరిగా చూపించాలని అక్కడి ప్రీమియర్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles