కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనం ఎంతోమంది సామాన్య భక్తులకు అందని ద్రాక్షాగానే మారింది. తమ కోంగుబంగారమైన శ్రీవారిని దర్శంచుకునేందుకు కోట్లాది మంది భక్తులు నిరంతరం వేచిచూస్తేనే వున్నారు. అయితే ప్రతి రోజు వేలాది మంది భక్తులతో నిత్యం కిటకిటలాడిన తిరుమల కరోనా కష్టకలాం.. కోవిడ్ మార్గదర్శకాలు, ఆంక్షల మధ్య నెలకు లక్షలమంది భక్తులకు మాత్రమే పరిమితం అయ్యింది. కొంతకాలం పాటు సామాన్యులకు తిరుమల కొండపైకి అనుమతి లేకుండాపోయింది. ఓం నమో నారాయణాయ అని నిత్యం వినిపించే భగవంతుడి నామస్మరణతో ప్రతిధ్వనించే సప్తగిరులు.. మౌనగిరిలుగా మారుతున్నాయన్న విమర్శలు వినిపించాయి.
టీటీడీ చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డి చోరువతో సామాన్యభక్తులకు కూడా సర్వదర్శనం పరిమిత సంఖ్యలోనే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినా తిరుమల శ్రీవారి దర్శనం కోసం కోసం ఇప్పటికే ఎంతోమంది సాధారణ భక్తులు వేచిచూస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ రెండోదశ అన్ లాక్ నేపథ్యంలో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆన్ లైన్లో ప్రత్యక దర్శనం సహా సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో వడ్డీకాసుల వాడిని దర్శంచుకునే భాగ్యం లభించక చాలా మంది భక్తులు నిరాశకు గురవుతున్నారు. అన్ లైన్ అంటే ఏంటో కూడా తెలియనివాళ్లు, తెలిసినా.. అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.. ఎలా టికెట్లు బుక్ చేసుకోవాలో కూడా తెలియనివారి జాబితా చాలా పెద్దదే.
అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా తగు నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. అయినా టీటీడీ విడుదల చేసిన టికెట్లు హారతి కర్పూరంలా అయిపోతున్నాయి. లక్షల టికె్టుల నిమిషాల వ్యవధిలో బుక్ అవుతున్నాయి. అందరూ తమకు వెంకన్న దర్శనం కావాలని టికెట్ల విడుదల సమయం వరకు వేచివుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో టికెట్లు లభించని కలియుగ ప్రత్యక్షదైవం భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇక మరో నెలలోనైనా తమకు టికెట్లు లభిస్తాయా.. అని వేచిచూపులు ఇప్పటినుంచే ప్రారంభమయ్యాయి. ఎందుకంటే జనవరి నెల అందులోనూ న్యూఇయర్ లో శ్రీవారిని దర్శించుకోవాలన్నా అన్ని టికెట్లు బుక్ అయ్యాయి.
తాజాగా ఇవాళ శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్‌లో సోమవారం విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. రోజుకు 10 వేల టిక్కెట్ల చొప్పున జనవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే సైట్లో విడుదల చేసిన 15 నిమిషాల్లోనే ఈ టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. మరోవైపు, జనవరి 13 నుంచి 22 తేదీ వరకు మాత్రం కేవలం 5 వేల టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి ఉన్నందునే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more