Drunk police man attacks commuters on bus in Chennai తప్పతాగిన ఖాకీ.. కండక్టర్ సహా ప్రయాణికులపై దాడి..

Drunk man claiming to be cop attacks commuters on bus in chennai

drunk police man, drunken cop, drunk cop ruckus in bus, drunk police man ruckus in bus, drunk cop fight with commuters, drunk policeman fight with passengers, police man conductor, drunk policeman fight conductor, Chennai 70 V Bus, Drunk man, cop, commuters, TN government bus, conductor, Vandaloor, Koyambedu, Chennai, Viral Video

A drunk passenger, who identified himself as a policeman, was recently caught on camera creating a ruckus on a bus. He could also be seen attacking passengers and even the conductor. The incident took place on a 70V city bus operating between Vandaloor and Koyambedu.

ITEMVIDEOS: తప్పతాగిన ఖాకీ.. కండక్టర్ సహా ప్రయాణికులపై దాడి..

Posted: 12/01/2021 05:54 PM IST
Drunk man claiming to be cop attacks commuters on bus in chennai

తనకు తానుగా పోలీస్ అని చెప్పుకునే వ్యక్తి ఏ మంచిపని చేసినా.. ప్రజలు హర్షిస్తారు. అరే ఆయనరా పోలీస్ అంటే అంటూ శ్లాఘిస్తారు. కానీ అదే పోలీస్ అనే పదం చెప్పి చెడు పని చేస్తే.. ఈ మధ్యకాలంలో అందునా ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న సెల్ ఫోనే అయినా వ్యక్తులు పరువు తీసి బజారులో పెట్టేస్తోంది. దానిని కవర్ చేసుకోవడానికి వారు స్టోరి అల్లే లోపు అది కాస్తా వైరల్ కావడం.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం.. వెనువెంటనే చర్యలకు ఉపక్రమించడం అన్ని జరిగిపోతాయి. ఇలా సాంకేతిక విప్లవం దోహదపడుతోంది

ఇక ప్రస్తుత తరుణంలో చోరీలకు పాల్పడే దొంగలను కూడా పోలీసులకు ఈజీగా పట్టిస్తోంది ఈ సాంకేతిక వ్యవస్థే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తప్పతాగి ఈ విషయాన్ని మర్చిపోయాడో.. లేక తాను పోలీస్.. తాను చెప్పిందే వేదం అనుకున్నాడో తెలియదు కానీ.. తనకు తానుగా పోలీస్‌ అని చెప్పుకుంటున్న వ్య‌క్తి త‌ప్ప‌తాగి చెన్నైలోని అర్టీసీ బస్సులో రచ్చరచ్చ చేశాడు. తాగిన మైకం నశాలానికి ఎక్కిందో ఏమో తెలియదు కానీ..బ‌స్సులోని తోటి ప్ర‌యాణీకులతో కలియబడ్డాడు. అక్కడితో అగని సదరు పోలీసు.. చివరకు వారిని విడదీసీ పక్కకు వెళ్లి కూర్చోండీ అన్న కండ‌క్ట‌ర్‌పై కూడా దాడి చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నై న‌గ‌రంలోని వండ‌లూర్-కోయంబేడు మ‌ధ్య తిరిగే 70వీ సిటీబ‌స్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌ద‌రు వ్య‌క్తి తోటి ప్ర‌యాణీకుడితో ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌గా స‌ర్ధిచెప్పిన వారిపైనా దుర్భాష‌లాడాడు. సీటులో కూర్చోమ‌ని లేదా బ‌స్ దిగి వెళ్ల‌మ‌ని చెప్పిన కండ‌క్ట‌ర్‌పైనా దాడికి తెగ‌బ‌డ్డాడు. ఎంద‌రు వారించినా బ‌స్‌లో హంగామా చేస్తున్న వ్య‌క్తి తీరుతో స‌హ‌నం కోల్పోయిన ప్ర‌యాణీకులు బ‌ల‌వంతంగా అత‌డిని బ‌స్ నుంచి దింపివేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నిందితుడిపై చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెన్నై పోలీసులు పేర్కొన్నారు. కాగా రాత్రివేళ ఫుల్‌గా మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతున్న పోలీసును ప్ర‌యాణీకులు ప‌ట్టుకున్న ఘ‌ట‌న ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో చెన్నైలో వెలుగుచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chennai 70 V Bus  Drunk man  cop  commuters  TN government bus  conductor  Vandaloor  Koyambedu  Chennai  Viral Video  

Other Articles

Today on Telugu Wishesh