YSRCP MLA meets Amaravati farmers in Nellore అమరావతి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం

Ysrcp mla kotam reddy meets amaravati farmers in nellore

YSRCP MLA, Kotam Reddy Sridhar Reddy, SSB Function Hall, MahaPadayatra, Nellore Rural, Amaravati Farmers, slogans, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, United Nations Human Rights Council, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

In an interesting event, K. Sridhar Reddy, a member of the Legislative Assembly from Nellore Rural, met with farmers who were forced to halt their Maha Padayatra owing to rain and were staying at the SSB function hall in Nellore. Due to severe rains in the area, the farmers decided to prolong the break for a second day on Monday. The MLA offered them all kinds of services and encouraged the farmers to contact him if they needed anything else.

ITEMVIDEOS: అమరావతి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం

Posted: 11/29/2021 03:01 PM IST
Ysrcp mla kotam reddy meets amaravati farmers in nellore

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి నుంచి తిరుపతి వరకు రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు వరుణుడు బ్రేక్ ఇచ్చాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి రైతులు తాము బస చేసిన ఎస్ఎస్బి కళ్యాణమండపంలోనే గత రెండు రోజులుగా సేద తీరుతున్నారు. అయితే అవరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తూ తన నియోజకవర్గం పరిధిలోని ఓ కళ్యాణమండపంలో బస చేస్తున్నారన్న వార్త తెలుసుకున్నా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైతుల వద్దకు చేరుకున్ని వారికి సంఘీభావం తెలిపారు.

తన నియోజకవర్గ పరిధిలోనే అమరావతి ప్రాంత రైతులు గత రెండు రోజులుగా బసచేశారన్న సమాచారం తెలుసింది. దీంతో మీమల్ని కలుద్దామని తాను వచ్చానని చెప్పారు. రైతులుకు ఏమీ కావాలన్నా.. తనకు వెంటనే ఫోన్ చేయవచ్చునని చెప్పారు. అంతేకాదు రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పినతో పాటు వర్షం తగ్గి వారు తిరిగి పాదయాత్రను ప్రారంభించేంతవరకు వారికి కావాల్సిన సరుకులు కూడా తాను పంపిస్తానని చెప్పారు. అయితే తాను తన పార్టీకి వ్యతిరేకంగా ఏ పనులు చేయడం లేదని చెప్పుకోచ్చిన ఆయన.. దేశానికే అన్నం పెట్టే రైతు అవస్థలు పడకూడదని తాను వారిని సంఘీభావం తెలపడానికి వచ్చానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles