TDP Won in Kondapalli Municipal Election కీలకంగా మారిన ఎంపీ ఓటు.. టీడీపీ ఖాతాలోకి కొండపల్లి

Amidst tension tdp bags kondapalli municipal chairman post

Kondapalli Municipal Chairman, tdp, TDP Vijayawada MP Kesineni Nani, MP Kesineni Nani vote brings victory, ex officio member. TDP candidate Chitti babu, YSRCP candidate Jogi Ramu, Chennuboyina Chitti Babu, Vice Chairman Chuttukuduru Srinivasa Rao, seccond vice chair person, Karapikonda SriLakshmi, Krishna District, Andhra Pradesh, Politics

The opposition TDP dealt a blow to ruling YSRCP in Andhra Pradesh by bagging chairman post in Kondapalli municipality. In the election held today, TDP candidate Chitti babu got 16 votes while YSRCP candidate Jogi Ramu got 15 votes. TDP Vijayawada MP Kesineni Nani ensured victory for TDP by one vote by exercising his vote as ex officio member.

ముగిసిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక.. టీడీపీదే కొండపల్లి

Posted: 11/24/2021 03:42 PM IST
Amidst tension tdp bags kondapalli municipal chairman post

భారీ బందోబస్తు మధ్య కొండపల్లి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ముగిసాయి. కృష్ణా జిల్లాలోని అత్యంత కీలకమైన ఈ కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ పదవులను టీడీపీ తమ ఖాతాలో వేసుకోవడంలో ఎక్స్ అఫిఫియో సభ్యుడిగా వున్న పార్లమెంటు సభ్యుడు ఎంపీ కేశినేని నాని ఓటు కీలకంగా మారింది. ఎంపీ ఓటకు ముందు సమాన ఓట్లతో వున్న రెండు పార్టీలు.. ఎంపీ ఓటుతో టీడీపీకి మెజారిటీ లభించిడంతో పాటు ఈ మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకోగలిగింది. దీంతో చైర్మన్‌ సహా రెండు వైస్ చైర్మన్ పదవులను కూడా టీడీపీ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది.

కొండపల్లి టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చెన్నుబోయిన చిట్టుబాబును పార్టీ సభ్యులు చైర్మన్ అభ్యర్థిగా బలపరిచారు. వైస్ చైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, రెండో వైస్ చైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫలితాలను అధికారులు ప్రకటించలేదు. ఫలితాలను వెంటనే ప్రకటించవద్దన్న హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల అధికారిని కోరారు. టీడీపీ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునిసిపల్ చట్టంలో రహస్య ఓటింగ్‌ లేదని, చేతులెత్తి చైర్మన్‌ను ఎన్నుకోవడం మాత్రమే ఉందని, దానిని ఎలా ఉల్లంఘిస్తారంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారిన క్రమంలో.. సజావుగా జరిపించాలంటూ టీడీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో హైకోర్టు కీలక ఆదేశాల నేపథ్యంలో ఈ ఉదయం 10.30 గంటలకు ఎన్నిక ప్రారంభమైంది. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. అంతేకాదు, పిటిషనర్లకు కూడా రక్షణ కల్పించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఎన్నిక అనంతరం ఫలితాలు ప్రకటించవద్దని, వివరాలు తమకు అందజేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కొండపల్లి ఎన్నిక కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీకి 15 మంది, వైసీపీకి 14 మంది కౌన్సిలర్ల బలం ఉంది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నరు. ఎక్స్ అఫిషియో ఓట్ల అనంతరం టీడీపీ బలం 16కి చేరగా, వైసీపీ బలం 15కు పరిమితం కావడంతో.. టీడీపీ పార్టీకి చైర్మన్ పదవి సొంతమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles