‘Hard decisions’ if denied BJP ticket: Utpal Parrikar బీజేపికి అథిష్టానానికి మనోహర్ పారికర్ తనయుడి వార్నింగ్

Hard decisions if denied bjp ticket warns former cm s son utpal parrikar

denied BJP ticket, Goa Assembly Elections, Manohar Parrikar’s son, Utpal Parrikar, Warn, BJP High command, Panjim ticket, Goa, Politics

Utpal Parrikar, son of late former Goa chief minister Manohar Parrikar, warned on Thursday that he may have to take “hard decisions” if he is denied ruling Bharatiya Janata Party (BJP) ticket to contest assembly elections from Panaji even as he was ‘fully confident’ that he would get it. Manohar Parrikar represented the seat for over 25 years.

టికెట్ ఇవ్వలేదో.. తీవ్ర పరిణామాలు: బీజేపికి మనోహర్ పారికర్ తనయుడి వార్నింగ్

Posted: 11/18/2021 06:20 PM IST
Hard decisions if denied bjp ticket warns former cm s son utpal parrikar

గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీ అధిష్టానానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఇవ్వాలని కోరారు. తనకు పనాజీ స్థానంలో పోటీ చేసేందుకు తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని హెచ్చరించారు. తన తండ్రి మాజీ కేంద్రమంత్రి, గోవా ముఖ్యమంత్రి అయిన దివంగత మనోహర్‌ పారికర్‌.. ఈ స్థానానికి 25 ఏండ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

‘నేను పనాజీ (పంజిమ్) నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పటికే దీని గురించి పార్టీకి చెప్పాను. పార్టీ టిక్కెట్ ఇస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని మీడియాతో అన్నారు. బీజేపీ ఒకవేళ టిక్కెట్ నిరాకరించిన పక్షంలో ఏమి చేయాలనుకుంటున్నారు? అని ఉత్పల్‌ను మీడియా ప్రశ్నించింది. అయితే దాని గురించి మాట్లాడే సమయం ఇది కాదని ఆయన అన్నారు. ‘దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనోహర్ పారికర్ తన జీవితంలో ఏదీ తేలికగా పొందలేదు. అన్నింటినీ ఆయన ఎంతో కష్టపడి దక్కించుకున్నారని చెప్పారు.

అదేవిధంగా, తాను కూడా తనకు కావలసిన దాని కోసం పని చేస్తున్నానని అన్నారు. తనకు టికెట్ రాని పక్షంలో తాను కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి తనకు అవసరమైన బలం కోసం ప్రార్థిస్తున్నాను’ అని వ్యాఖ్యానించి పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ ఆ అవసరం వస్తే బీజేపీలో ఉంటూనే పోరాటం చేస్తానని ఉత్పల్‌ పారికర్‌ తెలిపారు. ‘నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు, నేను ప్రజల మాట వింటాను. నేను పార్టీకి చెప్పాను. పార్టీ నాకు (టిక్కెట్) ఇస్తుంది. నేను నమ్మకంగా ఉన్నాను’ అని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles