Officers Issued Notices To Jamuna Hatcheries జమున హ్యచరీస్ కు రెవెన్యూ అధికారులు నోటీసులు

Toopran revenue officials issues notices to jamuna hatcheries over assinged land

Etala Jamuna, Etala Rajender, jamuna hatcheries, nithin reddy, Toopran RDO, survey notice, assinged land, Telangana, Politics

Toopran revenue officials issues notices to Jamuna Hatcheries over assinged land, which is related to BJP MLA Etela Rajender, which led to the cause of Huzurabad bye-elections.

జమున హ్యచరీస్ కు రెవెన్యూ అధికారులు నోటీసులు

Posted: 11/08/2021 06:33 PM IST
Toopran revenue officials issues notices to jamuna hatcheries over assinged land

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గోని.. ఆటుపోట్లు తిని.. రాటు తేలిన రాజకీయ వేత్త ఈట‌ల రాజేంద‌ర్. ఆయన నీతి, నిబద్దతకు, న్యాయానికి, నీజాయితీకి నిలబడిన వ్యక్తి అని తెలిసే.. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థికశాఖా మంత్రిగా ఆయనకు తన క్యాబినెట్ లో ప్రాధాన్యతను కల్పించి గౌరవించారు. ఉద్యమంలో భాగంగా పోలిస్ స్టేషన్లు, జైళ్లు, కోర్టులు ఇలా అన్నింటినీ పార్టీ అధినేత కేసీఆర్ తో కలసి ఎదుర్కోన్నారు. ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లే విషయమై ప్రణాళికలను రచించే క్రమంలో భాగంగా కేసీఆర్ నివాసమే తన నివాసంగా మార్చుకుని.. ఉధ్యమ కార్యచరణను రూపోందించే పనిలో రోజులు, వారాలు, నెలలు నిమగ్నమయ్యారు ఈటెల.  

అలాంటి ఈటెలను రెండో పర్యాయం అధికారంలోకి రాగానే ఎందుకు టార్గెట్ చేశారు. తొలి పర్యాయంలోనే తన వారుసుడే తన తరువాత ఏలికగా మారుతాడన్న సంకేతాలను ఇచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో హరీశ్ రావును కేవలం మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేసి.. తన తనయుడ్ని మాత్రం రాష్ట్ర నేతగా రూపుదిద్దే కార్యచరణను చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను ఆయన భుజస్కాంధాలపై పెట్టి తొలి పర్యాయం 99 స్థానాలు గెలుచుకోవడంతోనే ఆయన గ్రాప్ అప్పటి సీనియర్లను అధిగమించిపోయింది. దీంతో పార్టీ నేతల్లో కేసీఆర్ తరువాత కేటీఆరే అన్న వాదన బలంగా వినిపించింది.

ఈ క్రమంలో తన వారసుడినే.. పార్టీకి కూడా రాజకీయ వారసుడిగా చేసి తాను జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రీయాశీలకం కావాలని భావించారు కేసీఆర్. ఈ క్రమంలో ఫెడరల్ ఫ్రంట్ కూడా పురుడు పోసుకున్న విషయం, పలు రాష్ట్రాలకు చెందిన ఎన్డీయేతర నేతలను సీఎం కేసీఆర్ కలసి.. వారితో సమావేశాలను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యమ పార్టీలో వారసత్వానికి అవకాశం లేదని, సీనియారిటీదే కీలక పాత్ర అని కేసీఆర్ తరువాత ఆ స్థానంలో కొనసాగేందుకు ఈటెల రాజేందర్ కే ఎక్కువ అర్హత ఉందన్న వాదనలు బలంగా వినిపించాయి.

ఈ క్రమంలో తన తరువాత ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం అత్యంత చాకచక్యంతో చెప్పిన కేసీఆర్.. తాను ఉన్నంత వరకు ఆ పదవిలో తానే కొనసాగుతానని క్లారిటీ ఆచ్చిరు. అయితే తన వారసుడైన కేటీఆర్ కు అందివచ్చిన అవకాశం దూరం కావడంతో.. ఈటెలను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని వార్తలు వినిపిచాయి. దీంతో పక్కా స్కెచ్ ప్రకారం కేసీఆర్ తన ప్రణాళికను అమలు చేశారు. ప్రణాళికలో భాగంగా ఈటెల సతీమణి జమున నిర్వహిస్తున్న జమున హ్యచరీస్ లో అసైన్డ్ భూములు వున్నాయని.. అక్కడి రైతులు నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి, మంత్రులకు లేఖలు రాశారని కూడా వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో మంత్రి అయినా సరే ప్రజల తరువాతే.. అని చెప్పుకోచ్చిన కేసీఆర్ సర్కార్.. ఈటెలను మంత్రి పదవి నుంచి తప్పించి.. ఆయనపై అసైన్డ్ భూములపై విచారణ చేయించాలన నిర్ణయించారు. అసైన్డ్ భూమలు చట్టాలకింద కేసులు నమోదుచేసి సర్వేలు కూడా చేసింది కేసీఆర్ సర్కార్. ఈక్రమంలో కరోనా కేసులు విజృంభించడంతో విచారణను తాత్కాలికంగా వాయిదా వేసిన తరువాత మళ్లీ ఇన్నాళ్లకు భూముల వ్య‌వ‌హారంలో మ‌రోసారి అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మెద‌క్ జిల్లా హ‌కీంపేట‌లోని జమున హ్యాచరీస్ భూములలో అసైన్డ్ భూములు వున్నాయన్న అభియోగాలపై స‌ర్వే చేయ‌నున్న‌ట్టు నోటీసులు అందించింది.

హ‌కీంపేట‌లోని స‌ర్వే నం-97లో స‌ర్వే చేయ‌నున్న‌ట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న హకీంపేట, అచ్చంపేట భూముల్లో సర్వే చేపట్టనున్నామని, కావును భూ యజమానులైన ఈటెల జమున, నితిన్ రెడ్డిలు స‌ర్వేకు హాజ‌రు కావాల‌ని తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున‌, కుమారుడు నితిన్ రెడ్డి పేరుతో జ‌మునా హ్యాచ‌రీస్ వ‌ద్ద నోటీసులు అంటించారు. అయితే గతంలో జరిపిన సర్వేలో మాత్రం అధికారులు పోలీసుల బలగాల పహారాలో మాత్రమే సర్వేచేసిన అధికారులు ఈ సారి మాత్రం నోటీసులు అందించి వారిని హాజరుకావాలని కోరడం గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles