PMLA court sends Anil Deshmukh to 14-day judicial custody అనీల్ దేశ్ ముఖ్ కు 14 రోజుల జ్యడీషియల్ రిమాండ్.!

Special pmla court sends former home minister of maharashtra anil deshmukh to 14 day judicial custody

Former home minister, Anil Deshmukh, money laundering case, judicial custody, Special PMLA court, Hrishikesh Deshmukh, sessions court, anticipatory bail, Enforcement Directorate (ED), Maharashtra, Crime

A special holiday court here on Saturday remanded former Maharashtra home minister Anil Deshmukh in 14-day judicial custody in connection with an alleged money laundering case. Enforcement Directorate (ED) had issued summons to Hrishikesh for questioning in an alleged money laundering case in which his father Anil Deshmukh has been arrested.

అనీల్ దేశ్ ముఖ్ కు 14 రోజుల జ్యడీషియల్ రిమాండ్.!

Posted: 11/06/2021 07:08 PM IST
Special pmla court sends former home minister of maharashtra anil deshmukh to 14 day judicial custody

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్ ముఖ్ కు ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మనీలాండరింగ్ కేసుపై ఈ నెల 1న ఎన్ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆయనను అరెస్ట్‌ చేసింది. అనీల్ దేశ్ ముఖ్ కేసుకు సంబంధించి మరిన్నీ వివరాల కోసం తమ కస్టడీకి అప్పగించాలన్న ఈడీ అధికారుల పిటీషన్ నేపథ్యంలో కస్టడీకి అప్పగించిన విషయం తెలసిందే. కాగా, ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఇవాళ ముంబై హాలిడే కోర్టులో అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కస్టడీని పొడిగించాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.

అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మరోవైపు అనీల్ దేశ్ ముఖ్ కు బెయిల్‌ కోసం ఆయన న్యాయవాదులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ముంబైలోని హోటళ్లు, బార్ల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్ వాజ్‌ను హోంమంత్రి హోదాలో అనిల్‌ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో ఈడీ కూడా మనీలాండరింగ్ కింద దీనిపై విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా అనిల్‌ దేశ్ ముఖ్ ను 12 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఈ నెల 1న ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ గడువు ముగియడంతో అనిల్ దేశ్‌ముఖ్‌కు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా అనీల్ దేశ్ ముఖ్ తరపున ఆయన తనయుడు హృషికేశ్ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కాగా తండ్రి మనిలాండిరింగ్ కేసులో విచారణకు తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు హృషికేశ్ కు కూడా నోటీసులు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles