Baby elephant enjoys sugarcane treats చెరుకు గడలను లాగించేస్తున్న క్యూట్ బేబి..!

Baby elephant wearing pink bow and cover enjoys sugarcane treats

baby elephant, twitter, elephant video, cute video, Juicy sugarcane, baby elephant little pink outfit, twitter video, viral video, Trending video

Baby animals doing the most basic and random things can put a smile on one's face. This baby elephant is one of those cute animals who is here to make your day better. The clip, shared on Twitter, shows a baby elephant trying to munch on some juicy sugarcane. We bet that the video will leave you saying aww.

ITEMVIDEOS: చెరుకు గడలను లాగించేస్తున్న క్యూట్ బేబి..!

Posted: 11/02/2021 04:51 PM IST
Baby elephant wearing pink bow and cover enjoys sugarcane treats

చేప పిల్లకు ఈత నేర్పాలా.? పక్షి పిల్లకు ఎగరడం నేర్పాలా.? స్వతహాగా నేర్చుకునే అలవాటు వున్న జీవరాశులలో మనుషులకు మాత్రమే కొన్నింటిని నేర్పాల్సివస్తుంది. ఏ విషయంలోనైనా పక్కనబెడితే చిన్నారి శిశువులకు అన్నం తినిపించడం కూడా తల్లి నేర్పాల్సిందే. నడక కూడా తల్లిదండ్రుల చేయి పట్టుకునే నేర్చుకుంటారు చిన్నారులు. అలాంటి చిన్నారే అయినా.. తనకంటూ ఎవరూ ఏమీ నేర్పించకపోయినా.. తనకు తానుగా చెరుకుగడలను తినేస్తోందీ చిన్నారి. అయితే ఈ చిన్నారి ఎవరో అంటే బేటి ఎలిఫాంట్. అదేనండీ చిన్న ఏనుగు పిల్ల.

అప్పుడే పుట్టిన దూడలు, పెంపుడు జంతువుల పిల్లలు ఎంత ముద్దు గొలుపుతాయో. వాటిని విడిచి వెళ్లాలని కూడా అనిపించదు. ఎందుకంటే వాటి చిలిపి చేష్టలు భలే సరదాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ చిన్నారి ఏనుగు పిల్ల కూడా అలాగే చూడముచ్చటగా ఉంది. గులాభి రంగె డ్రెస్ వేసుకుంది. దాని జోలికి ఎవరూ రాకుండా.. అది కూడా ఎవరి జోలికి వెళ్లకుండా దానికి చుట్టూరా కర్రలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సరే అది బయటకు వెళ్లలేదు కదా.. అందుకని అది తినేందుకు ఓ టబ్ లో కొన్ని చెరుకు గడలను ముక్కలుగా కట్ చేసి వేశారు.

అయితే వాటిని తినే పనిలో పడిన చిన్నారి.. వాటిని టబ్ నుంచి తీసుకుంటూ చాలా వాటిని కింద నేలపై పడేసింది. ఇక ఒక్కోదాన్ని తీసుకునేందుకు ఎంతగానో ప్రయాసపడింది కూడానూ. ఇలా ప్రయాసపడి తీసుకున్న చెరుకు గడల ముక్కలను తన నోట్లో పెట్టుకునేందుకు కూడా కష్టపడింది. ఇక తన నోట్లో చెరుకుగడను పెట్టుకున్నాక ఈ చిన్నారి శ్రీకృష్ణుడి రేంజ్ లో వెనకాల రెండు కాళ్లను అదే తరహా పోజులో పెట్టి అరగించింది. ఆ తరువాత మరో చెరుకు గడను తీసుకునే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడిప్పుడే తినడం అలవాటు చేసుకుంటుందోని అర్ధం అవుతోంది.

ఈ చిన్నారిని అలా చెరుకు గడల ముక్కలను తినడం.. వాటిని ఆసాంతం అస్వాదించడాన్ని గమనించిన ఓ నెట్ జన్.. దానిని వీడియో తీసాడు. దానిని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. అంతే ఈ వీడియోను అనేక మంది చూస్తూ.. కామెంట్లు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ చిన్నారి ఏనుగును లక్షలాధి మంది ఇప్పటికే వీక్షించారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. మీరు ఓ లుక్‌ వేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby elephant  viral video  twitter  elephant video  cure video  Trending video  

Other Articles