Delay in paying farmers irks Telangana High Court ‘‘పరిహారం రైతుల హక్కు.. వాళ్లు బిక్షగాళ్లు కాదు’’

Farmers are not beggars compensate them says telangana high court

High Court, Telangana High Court, Farmers, Compensation, Land Acquisition, Sri Ram Sagar Project, Nizamabad, Official negligency,Farmers beggers, Hyderabad, Telangana Government, Telangana, Politics

A Division Bench of the Telangana High Court comprising Chief Justice Satish Chandra Sharma and Justice A Rajashekar Reddy while dealing with a contempt case filed by people whose land was acquired 55 years ago, said that the state government it is not doing charity by paying compensation to farmers whose properties were acquired. “Nor are the farmers beggars to beg for their compensation".

పరిహారం రైతుల హక్కు.. వాళ్లు బిక్షగాళ్లు కాదు: హైకోర్టు మండిపాటు

Posted: 10/30/2021 03:02 PM IST
Farmers are not beggars compensate them says telangana high court

‘రైతులు.. భిక్షగాళ్లు కాదు. వారి భూములు తీసుకున్న దరమిలా పరిహారం పోందడం వారి హక్కు.. వారికి పరిహారాన్ని తక్షణమే అందజేయాలని తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం, అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తున్నారు. వారికి పరిహారం ఇవ్వకుండా వారి భూములెలా స్వాధీనం చేసుకుంటారు’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిహారం కోసం ఎదురుచూస్తూ దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో అనేక మంది రైతులు తీవ్రఅవేదన, అందోళనలకు గురై దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆసహనం వ్యక్తం చేసింది.

భూ నిర్వాసితులకు రావాల్సినపరిహారం ఇకనైనా సాధ్యమైనంత త్వరగా చెల్లించాలని.. అంతేకానీ వారికి పరిహారం అందజేయడంలో ప్రభుత్వం ఎలాంటి దాతృత్వం చూపించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భూములు స్వాధీనం చేసుకొని ప్రాజెక్టులు నిర్మించి పరిహారం కోసం ఏళ్ల తర బడి వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని తేల్చిచెప్పింది. 1966లో తీసుకున్న తమ భూములకు పరిహారం చెల్లించలేదని, పరిహారం ఇవ్వాలంటూ ఇదే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయట్లేదంటూ జగిత్యాల జిల్లా రత్నాపూర్‌కు చెందిన బుక్కిరి లింగన్నతోపాటు మరో ఐదుగురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను న్యాయస్థాన ధర్మాసనం విచారించింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మళ్లీ విచారించింది. గతంలో ధర్మాసనం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో డిపాజిట్‌ చేయడంలో జాప్యం జరిగిందని వివరణ ఇచ్చారు. 1966లో నిజామాబాద్‌ జిల్లాలో ఎస్సార్‌ఎస్పీ ప్రాజె క్టు కోసం భూమి సేకరించారని, ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది గుడి మధుసూదన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరిహారం చెల్లిస్తామంటూ మూడుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ‘భూసేకరణ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా పరిహారం కోరుతూ వందల కేసులు దాఖలవుతున్నాయని న్యాయస్థానం తెలిపింది. పరిహారం దక్కించుకోవడం రైతుల హక్కు. తద్వారా ప్రభుత్వం ఏ ధాతృత్వ కార్యక్రమాన్ని చెపట్టినట్టు కాదని న్యాయస్థాన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని, పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles