Teenmar allanna held for ‘extortion’ తీన్మార్ మల్లన్నకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్

Telangana bjp activist teenmar mallanna sent to 14 day custody

Teenmaar Mallanna, Ch Naveen kumar, Toddy business, Uppu Santosh, Judicial remand, Nizamabad court, Q news, You tube Channel, Telangana crime

The Nizambad Police have arrested 'Q News' Channel CEO Chintapandu Naveen aka Teenmar Mallanna on October 25. He was arrested in an alleged extortion case for allegedly threatening an toody business man. The police had produced him in a nizamabad court on Monday. The Court sent him to 14 day Judicial Remand

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్

Posted: 10/26/2021 11:17 AM IST
Telangana bjp activist teenmar mallanna sent to 14 day custody

తీన్మార్ మల్లనగా తెలంగాణ ప్రజలకు సుపరిచితుడైన చింతపండు నవీన్ కు నిజామాబాద్‌ న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ కస్టడికీ విధించింది. దీంతో పోలీసులు ఆయనను నిజామాబాద్ జైలుకు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కల్లు వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించిన కేసులో జర్నటిస్టుగా కల్లులోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువస్తానని బెదిరింపులకు పాల్పడిన నవీన్.. వెలుగులోకి వాటినిన రానీయకూండదంటే తనకు డబ్బును చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశాడని కల్లు వ్యాపారి పిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.

క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేతగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ తనను బెదిరింపులకు గురిచేసి డబ్బను అడుగుతున్నారన్న కల్లు వ్యాపిరి పిర్యాదు మేరకు ఈ నెలలో కేసును నమోదు చేసిన పోలీసులు.. మల్లన్నను ఈ నెల 25 న్యాయస్థానంలో హాజరుపర్చాగా.. నిజామాబాద్ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా ఇదే కేసులో ఎ1 నిందితుడిగా వున్న మల్లన్న అనుచరుడు ఉప్పు సంతోష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, ఎ2 నిందితుడుగా ఉన్న మల్లన్నను నిన్న న్యాయస్థానంలో హాజరుపర్చారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన కల్లు వ్యాపారిని మొదట మల్లన్న అనుచురుడు ఉప్పు సంతోష్ బెదిరించాడని, అయితే అతడి మాటలను కల్లు వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదని, దీంతో ఏకంగా మల్లన్నే వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేశాడని తెలుస్తోంది. దీంతో మల్లన్నను ఈ కేసులో ఏ2 నిందితుడిగా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు ఈ నెల 10న నమోదు కాగా, అదే రోజున సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆ సమయంలో మల్లన్న మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. న్యాయస్థానం అనుమతితో చంచల్‌గూడ నుంచి మల్లన్నను తీసుకొచ్చిన పోలీసులు నిన్న నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles