Rickshaw puller receives Rs 3-crore IT notice రిక్షా కార్మికుడికి రూ.3 కోట్ల కట్టాలంటూ ఐటీ నోటీసులు

Rickshaw puller approaches cops after receiving rs 3 crore it notice

Rickshaw Puller, Income Tax Department, IT notice to Rickshaw puller, Pratap Singh, Highway police station, IT department, Mathura, Uttar Pradesh

A rickshaw puller approached the police in Uttar Pradesh after he was served a notice by the Income Tax (IT) department, asking him to pay over Rs 3 crore. Pratap Singh, a resident of Amar Colony in the Bakalpur area here, submitted a complaint at the Highway police station, claiming fraud, after he received the notice from the IT department.

రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ షాక్.. రూ.3 కోట్ల కట్టాలంటూ నోటీసులు

Posted: 10/25/2021 01:14 PM IST
Rickshaw puller approaches cops after receiving rs 3 crore it notice

తన అకౌంటు ఉన్న బ్యాంకు అధికారులు చెప్పిన కారణంగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసిన ఓ రిక్షా కార్మికుడికి ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని వర్గానికి చెందిన రిక్షా కార్మికిడికి ఏకంగా రూ.3 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. రిక్షా బండి చక్ర్ం ఒక రోజు తిరగకపోయినా తన పూట గడవని పరిస్థితుల్లో వున్న రిక్షావాలా.. ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఐటీ చెల్లించాలని నోటీసులు రావడంతో షాక్‌కు గురయ్యాడు. దిక్కుతోచని పరిస్థితుల నేపథ్యంలో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలోని బకాల్ పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీకి చెందిన ప్రతాప్‌ సింగ్‌ ఓ రిక్షా కార్మికుడు. రోజూ తన రిక్షా చక్రం లాగుతూనే బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పారు. దీంతో ఈ ఏడాది 15న బకాల్‌పూర్‌లోని జన్‌ సువిధ కేంద్రంలో పాన్‌ కార్డు కోసం అప్లయ్‌ చేశాడు. కొన్ని రోజులకు సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి.. పాన్‌కార్డు కలర్‌ కాపీని ప్రతాప్‌ సింగ్‌కు ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రకాశ్‌ సింగ్‌ అసలు కార్డుకు, కలర్‌ కాపీకి తేడా గుర్తించలేకపోయారు.

కాగా, ఈ నెల 19న రూ.3,47,54,896 చెల్లించాలని ఐటీ అధికారులు ప్రకాశ్‌ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు. తన జీఎస్టీ నంబర్‌తో 2018-19లో రూ.43,44,36,201 మేర వ్యాపారం చేసినందుకుగాను ఈ మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే తాను రిక్షా కార్మికుడినని చెప్పడంతో.. తన పాన్‌ కార్డును మరెవరో దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని ఐటీ అధికారులు సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles