Anand Mahindra shares video of ‘driverless’ bike ఆనంద్ మహీంద్రా పోస్టు చేసిన ‘‘డ్రవర్ లెస్ బైక్’’ చూశారా.?

Anand mahindra impressed by driverless motorcycle twitter issues red flag

Anand Mahindra, industrialist Anand Mahindra, Mahindra Group chairman Anand Mahindra, Musafir Hoon Yaaron, Elon Musk, Elon Musk’s driverless cars, Anand Mahindra, Mahindra Group chairman, Driverless, Elon Musk, Tesla, Driverless Bike, viral video, video viral, viral news, Trending video

Industrialist Anand Mahindra shared a video of a man riding a ‘driverless’ motorcycle, leaving the internet puzzled. A undated 30-second clip tweeted by a user and later retweeted by the Mahindra Group chairman shows a man speeding on the pillion of a motorcycle on a highway. There is no driver. He is sitting with his arms crossed and both his legs on one side.

ITEMVIDEOS: ఆనంద్ మహీంద్రా పోస్టు చేసిన ‘‘డ్రవర్ లెస్ బైక్’’ చూశారా.?

Posted: 10/22/2021 06:05 PM IST
Anand mahindra impressed by driverless motorcycle twitter issues red flag

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఈ రంగంలో ఎంతగానో అభివృద్ది చెందుతుంది. ఎంతలా అంటే ఏకంగా డ్రైవ‌ర్‌లెస్ కార్లు కూడా రాబోతున్నాయంటే అందుకు ఈ రంగాలో వస్తున్న విప్లవాత్మక మార్పులే కారణం. ఇప్పటికే ఈ తరహా కార్లు అనేక ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. ఇక ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని టెస్లా కంపెనీ నుంచి కూడా డ్రైవ‌ర్‌లెస్ కార్లు వ‌చ్చాయి. టెస్లా ఫౌండ‌ర్ ఎలోన్ మ‌స్క్ కూడా డ్రైవ‌ర్‌లెస్ కార్ల‌ను ప్ర‌పంచ‌మంతా తీసుకొచ్చేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఆయన బాటలోనే పలు కంపెనీలు కూడా డ్రైవర్ లెస్ కార్లను తీసుకువస్తున్నాయి.

గూగుల్ సహా పలు సంస్థలు ఈ మేరకు తమ డ్రైవర్ లెస్ కార్లను రూపోందించి.. వాటి ట్రయల్ రన్ పరీక్షలను నిర్వహించే పనుల్లో వున్నాయి. దీంతో యావత్ ప్రపంచానికి డ్రైవర్ లెస్ అనే పదం బాగా అలవాటైపోయింది. ఈ నేప‌థ్యంలో డ్రైవ‌ర్‌లెస్ బైక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అదేంటి డ్రైవర్ లెస్ బైక్ నిజమేనా అంటారా.. ఒక్కసారి పైనున్న ఫోటోను వీక్షించండీ. అది నిజంగా డ్రైవర్ లెస్ బైక్. ఎవరు నడిపించకుండానే రయ్య్ మని వెళ్తోంది. ఎలోన్ మ‌స్క్‌.. డ్రైవ‌ర్‌లెస్ కార్లు త‌ర్వాత‌.. ముందు ఇండియాలో వ‌చ్చిన డ్రైవ‌ర్‌లెస్ బైక్‌ను చూడు.. అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు.

ఆ వీడియో ప్రముఖ ఇండ‌స్ట్రియ‌లిస్టు ఆనంద్ మ‌హీంద్రా కంట‌ప‌డింది. దీంతో వెంట‌నే ఆ వీడియోను షేర్ చేస్తూ.. 1972లో వ‌చ్చిన బాలీవుడ్ సినిమా ప‌రిచ‌య్ నుంచి ముసాఫిర్ హూన్ యారూన్ అనే పాట‌ను గుర్తు చేసుకుంటూ.. డ్రైవ‌ర్ లేడు.. నేను ఎక్క‌డికి పోతున్నానో తెలియ‌దు.. అంటూ క్యాప్ష‌న్ పెట్టి ఆ వీడియోను షేర్ చేశాడు. ఇంత‌కీ ఆ వీడియో గురించి చెప్పాలంటే ఓ వ్య‌క్తి బైక్ వెనుక కూర్చొని ఉంటాడు. బైక్ స్పీడ్‌లో వెళ్తూ ఉంటుంది. ముందు ఎవ్వ‌రూ ఉండ‌రు. డ్రైవ‌ర్‌లెస్ కారులా.. డ్రైవ‌ర్‌లెస్ బైక్ అన్న‌మాట‌. ఇంత‌కీ ఆ బైక్ ఎలా వెళ్లింది? వెనుక కూర్చున్న వ్య‌క్తి ఆ బైక్‌ను ఎలా మేనేజ్ చేశాడు అనేది తెలియ‌క నెటిజ‌న్లు త‌ల‌గోక్కుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles