Priyanka Gandhi Allowed To Visit Home Of UP Man యూపీలోకి రావాలంటే పోలీసుల అనుమతి పోందాలా.?: ప్రియాంకా గాంధీ

After brief detention priyanka gandhi allowed to meet kin of agra man who died in police custody

Priyanka Gandhi Vadra, Priyanka Gandhi, Lucknow-Agra expressway, Congress, Arun Valmiki, sanitation worker, warehouse, theft of Rs 25 Lakhs, lock-up death, women police officers, selfies, women candidates, Uttar Pradesh, Politics, Crime

Congress leader Priyanka Gandhi Vadra was allowed to proceed to Agra to meet the kin of man who died in police custody after she was detained by the Uttar Pradesh police. Earlier in the day, Gandhi was stopped at the Lucknow-Agra expressway while she was on her way to Agra, and section 144 was imposed in the area.

ఉత్తర్ ప్రదేశ్ లోకి రావాలంటే పోలీసుల అనుమతి పోందాలా.?: ప్రియాంకా గాంధీ

Posted: 10/20/2021 07:19 PM IST
After brief detention priyanka gandhi allowed to meet kin of agra man who died in police custody

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కొంత సమయం అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అమెతో పాటు మరో నలుగురిని ఆగ్రాకు వెళ్లేందుకు అనుమతించారు. ఆగ్రాలో శానిటరీ వర్కర్ ను దొంగతనం అభియోగాలపై అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలిస్ స్టేషన్ లో పెట్టగా ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అయితే ఇది లాకప్ డెత్ అని.. పోలీసులే శానిటరీ వర్కర్ మరణానికి కారణమని అరోపణలు వెల్లువెత్తడంతో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ బయలుదేరారు. దీంతో పోలీసులు లక్నో-అగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై అమెను మరోసారి ఇవాళ అడ్డుకున్నారు.

ఆగ్రాలో పోలీస్‌ కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు బుధవారం ఆమె వెళ్తున్న వాహనాన్ని నిలిపివేశారు. ఆగ్రాలో సెక్షన్ 144 అమలులో వుందని అందుచేత రాజకీయ నాయకులతో పాటు ఎవరినీ ఆగ్రాకు అనుమతించరాదని జిల్లా కలెక్టర్ అదేశాలు జారీచేశారని.. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలను పరిమర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్లగా తొలిసారిగా అడ్డుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ మరోమారు అమెను అడ్డుకుని.. ఆమె వెళ్తున్న వాహనాన్ని ముందుకు కదలనీయలేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

అవసరమైన అనుమతులు లేనందునే ప్రియాంక గాంధీని నిలువరించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. అయితే తాను ఎక్కడికి వెళ్లాలన్నా పరిమిషన్‌ తీసుకోవాలా అని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, రూ.25 లక్షలు చోరీ చేసిన ఆరోపణలతో అరెస్ట్‌ అయిన అరుణ్ అనే వ్యక్తిని జగదీష్‌పురాలోని పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్‌ చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి అతడ్ని ఇంటి నుంచి అరెస్ట్‌ చేయగా అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారని ఆగ్రా సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

కాగా పోలీసుల అడ్డగింతపై మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. తాను ఆగ్రాకు వెళ్లకూడదని, కలెక్టర్ అదేశాల నేపథ్యంలో అడ్డుకోక తప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే తాను ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్తేంటే మినహాయించి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తనను అడ్డుకుంటున్నారని అరోపించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పోలీసులు అనుమతి తీసుకోవాలా.? అని ప్రశ్నించారు. ఇకనేం తాను రెస్టారెంట్లలో కూర్చుంటానని, అదే మీకు రాజకీయంగా ఎంతో సౌకర్యవంతంగా వుంటుందని విమర్శించారు. తాను బాధిత కుటుంబంతో కలవాలని అమె అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles