Babul Supriyo resigns as MP, says his Heart is heavy ఎంపీ పదవికి మాజీ కేంద్రమంత్రి బాబూల్ సుప్రియో రాజీనామా.!

My heart is heavy began political career with bjp says babul supriyo after resigning as mp

Babul Supriyo, Babul Supriyo resigns, Babul Supriyo TMC, Babul Supriyo BJP, Amit Shah, Asansol, Mamata Banerjee , Abhishek Banerjee, Trinamool Congress, Babul Supriyo resigns from Lok Sabha, Om Birla, Lok Sabha Speaker, Trinamool Congress, BJP, PM Modi, Amit Shah, JP Nadda, Mamata Banerjee, West Bengal, Politics

Former Union Minister Babul Supriyo said he was saddened to leave the BJP after he formally resigned as a Lok Sabha MP. Speaking to reporters following a meeting with Lok Sabha Speaker Om Birla, Supriyo said he was grateful to Prime Minister Narendra Modi and top BJP leaders for giving him his political break and key roles when he was in the party.

నా గుండె భారంగా ఉంది: ఎంపీ పదవికి బాబూల్ సుప్రియో రాజీనామా.!

Posted: 10/19/2021 04:27 PM IST
My heart is heavy began political career with bjp says babul supriyo after resigning as mp

కేంద్రమంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణలో బాగంగా తన మంత్రి పదవిని కోల్పోయిన బాబుల్ సుప్రియో.. ఇక తాను రాజకీయాల నుంచి శాశత్వంగా తప్పుకుంటానని, మరోమారు ఎన్నికలలో పోటీ చేయనని చెప్పిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయన తన నిర్ణయాన్న మార్చుకుని తృణముల్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తన పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇశాళ బాబుల్ సుప్రియో త‌న ఎంపీ ప‌ద‌వికి అధికారికంగా రాజీనామా చేశారు.

ఈ ఉద‌యం ఢిల్లీలో లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నివాసానికి వెళ్లిన బాబుల్ సుప్రియో.. నేరుగా ఆయ‌న‌కు రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. అనంత‌రం ఓం బిర్లా నివాసం ముందు మీడియాతో మాట్లాడుతూ.. తాను తీసుకున్న నిర్ణయంతో తన గుండె బరువెక్కిందన్నారు. రాజకీయంగా తాను అరంగ్రేటం చేసిన బీజేపి పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన హృదయానికి భారమైనా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రాజకీయంగా అడుగులు వేస్తున్న తరుణంలోనే తనపై నమ్మకాన్ని ఉంచిన పార్టీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

త‌న‌కు పార్టీలో ఇన్నాళ్లు ప‌నిచేసే అవకాశం ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి, పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు బాబుల్ సుప్రియో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పార్టీలో వారు త‌న‌పై ఎంతో విశ్వాసం ఉంచార‌ని గుర్తుచేసుకున్నారు. అయితే, పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ప్పుడు ఆ పార్టీ ఎంపీగా కొన‌సాగ‌డ‌టం క‌రెక్టు కాదని, అందుకే తాను ఇవాళ ఎంపీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేశాన‌ని చెప్పారు. బాబుల్ సుప్రియో గ‌త నెల‌లో బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. రెండు పర్యాయాలు అసన్ సోల్  పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఆయన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలను నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles