Police shares Photo of Tadepalli rape case accused ‘‘ఇతడి ఆచూకీ ఎక్కడైన కనిపిస్తే.. చెప్పండీ’’: ఏపీ పోలీసులు

Tadepalli rape case police shares photo and details of 2nd accused in facebook

Crimes Against Women, Tadepalligudem gang rape, tadepalligudem rape case accused, tadepalligudem accused, Photo shared by police, accused details, police share accused details, Tadepalligudem, gang rape, accused, police, accused details, Facebook, Guntur, gang raped in Guntur, Guntur news, Guntur latest news, Andhra Pradesh, Crime

Andhra Pradesh Police are still hunting for the second accused in the sensational gang rape case on the Krishna river bank at Seethanagaram, today police shared the photo and details of the accused and appeals people to give information if they find him.

తాడేపల్లి అత్యాచార కేసులో నిందితుడితడే.. వివరాలు షేర్ చేసిన పోలీసులు

Posted: 10/18/2021 12:43 PM IST
Tadepalli rape case police shares photo and details of 2nd accused in facebook

ఆంధ్రప్రదేశ్ లో పెనుసంచలనం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు ప్రకటనలు చేస్తున్నా.. ఈ కేసులో మరో నిందితుడు మాత్రం ఇప్పటికీ అజ్ఞాతంలోనే వున్నాడు. ఈ ఏడాది జూన్ 19న జరిగిన ఈ ఘటనలో.. అరోపణలు ఎదుర్కోంటున్న నిందితులు నేరాలు చేయడంలో.. తప్పించుకు తిరగడంలోనూ బాగా అరితేరినవారిగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఆగస్టు నెలలో ప్రధాన నిందితుడ్ని పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టినా.. ఈ కేసులోని మరో నిందితుడు మాత్రం ఇప్పటికీ చిక్కకుండా పోలీసులనే ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు.

ఈ క్రమంలో రెండో నిందితుడికి సంబంధించి వారు ప్రజల సహకారం కావాలని కోరారు. అతడి ఫోటోతో పాటు వివరాలను కూడా సేకరించిన పోలీసులు.. వాటిని ప్రజలకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకున్నారు. ఇక దీంతో ఈ నిందితుడు ఎక్కడైనా, ఎవరికైనా కనిపిస్తే చెప్పాలంటూ వారు ఫేస్‌బుక్ ద్వారా కోరారు. రెండు ఫొటోలు, వివరాలను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద కొన్ని నెలల క్రితం యవతిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ ఎ-2 నిందితుడిగా ఉన్నాడు. ఎ-1 కృష్ణతోపాటు అతడి వద్ద సెల్‌ఫోన్లు తాకట్టు పెట్టుకున్న మరో వ్యక్తిని ఎ-3గా చూపించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఎ-2 ప్రసన్నరెడ్డి మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.  దీంతో అతడి పోటో, వివరాలను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసిన పోలీసులు కనిపిస్తే చెప్పాలని కోరారు.

ఇక నిందితుడి వివరాలు ఇలా :-
వెంకట్‌ది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కుక్కలవారిపాలెం. పూర్తిపేరు రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్. వయసు 22 సంవత్సరాలు. కుడిచేతిపై పుణ్యవతి అనే పచ్చబొట్టు ఉంటుంది. రైళ్లలో యాచిస్తూ సమోసాలు విక్రయించే వారితో తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు క్యాటరింగ్ పనులకు వెళ్లడం, తాపీపని వంటి పనులు కూడా చేస్తుంటాడు. అత్యాచార ఘటన తర్వాత అండర్‌పాస్‌ల వద్ద, పాడుబడిన భవనాల్లోను, రైలు పట్టాల పక్కన, అన్నదానాలు చేసే ఆలయాల పక్కన ఆశ్రయం తీసుకుంటున్నాడు. నిందితుడిని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వండి’’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నోట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tadepalligudem  gang rape  accused  police  accused details  Facebook  Guntur  Andhra Pradesh  crime  

Other Articles